Viral Video: స్కూలు పిల్లల బ్యాగుల్లో కండోమ్స్, కత్తులు - షాకైన స్కూల్ ప్రిన్సిపాల్ - అన్ని స్కూళ్లలో చెక్ చేస్తే ? వీడియో
Nasik: స్కూల్ పిల్లలు బ్యాగుల్లో పుస్తకాలు కాకుండా ఇంకే తెస్తున్నారో చూడాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కు అనిపించింది. అంతే.. బ్యాగుల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. కానీ షాకయ్యే నిజాలు తెలిశాయి.

Condoms, Knives In Backpacks Of Class 7 To 10 Students : రోజులు మారాయి. కాలం మారింది. చదువులు మారాయి. అంతేనా.. ఓటీటీలు వచ్చాయి.. చానల్స్ వచ్చాయి..సోషల్ మీడియా కూడా పిల్లల మెదళ్లలోకి చేరిపోయింది. మరి ఇలాంటి సమయంలో పిల్లలు ఎలా ఉంటారు?. ఎవరూ ఊహించలేని విధంగా ఉంటారు. దానికి సాక్ష్యం నాసిక్ లోని ఓ స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో బయటపడిన వస్తవులు.
పిల్లలు బ్యాగుల్లో ఏమున్నాయో చెక్ చేయాలనుకున్న ప్రిన్సిపాల్
నాసిక్ లో పదో తరగతి వరకూ చదువులు చెప్పే ఉన్న పాఠశాల ఉంది. వీలైనంత వరకూ ఆ స్కూల్ కు మంచి పేరే ఉంది. విద్యార్థులు ఎప్పుడూ ఘోరాలు చేస్తున్నట్లుగా రికార్డు కాలేదు. కానీ ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఎక్కడో తేడా కొట్టింది. మారుతున్న సమాజంలో పిల్లలు ఎలా మారిపోతున్నారో తెలుసుకోవాలంటే వారి బ్యాగుల్ని చెక్ చేయాలని అనుకున్నారు. అందుకే కొంత కాలం పాటు ర్యాండమ్‌గా కొంత మంది బ్యాగుల్ని స్కూల్లోకి వచ్చేటప్పుడే చెక్ చేయడం ప్రారంభించారు.
బ్యాగుల్లో కత్తులు, కండోమ్స్
ఇలా కొద్ది రోజుల పాటు చెక్ చేస్తూ వచ్చారు. చెకింగ్ చేసిన ప్రతీ సారి షాక్ కు గురి కావడం కామన్ అయిపోతోంది. ఎందుకంటే వారికి ప్రతీ సారి పెద్దలకు మాత్రమే వస్తువులు దొరికాయి. ఓ సారి కండోమ్స్.. మరో సారి కత్తులు.. మరో సారి ఇంకోటి..ఇలా చాలా పెద్దలకు మాత్రమే వస్తువులు దొరికాయి. అయితే పిల్లల భ విష్యత్ దృష్ట్యా అవి ఎవరు తెచ్చారన్నది బయటపెట్టలేదు కానీ.. వారి వ్యవహారంపై ఫాలో అప్ చేయడం ప్రారంభించారు. స్కూల్ పిల్ల బ్యాగుల్లో దొరికిన వస్తువుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#WATCH | Nashik: Condoms, Knives Found In Backpacks Of Class 5 & 6 Students In School In Ghoti
— Free Press Journal (@fpjindia) April 8, 2025
Read story by Prashant Nikale: https://t.co/28s8VaA4dz #Maharashtra #NashikNews pic.twitter.com/xafvcIN8Lu
స్కూల్ యాజమాన్యానికి తల్లిదండ్రుల సపోర్టు
పిల్లలు తప్పుడు మార్గంలో పయనించకుండా ఉండేందుకు వారు తప్పు చేస్తూంటే.. మంచి చెప్పేందుకు ఎప్పటికప్పుడు బ్యాగుల్ని తనిఖీలు చేయడం చేస్తున్నామని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు.. స్కూల్ యాజమాన్యానికి సపోర్టుగా ఉన్నారు. పిల్లలు దారి తప్పకుండా చేయాల్సిన అన్ని పనులకు తమ మద్దతు ఉంటుందంటున్నారు.
నాసిక్ స్కూల్ లో జరిగిన ఈ వ్యవహారంతో.. ఇప్పుడు అన్ని స్కూళ్లలో విద్యార్తుల బ్యాగ్స్ ను యాజమాన్యాలు తనిఖీ చేస్తే వారిపై ఓటీటీ ఎఫెక్టులు ఎంత ఎక్కువగా ఉన్నాయో క్లారిటీ వస్తుందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

