Pope Election Process: పోప్‌ను ఎలా ఎన్నుకుంటారు? ప్రక్రియ పూర్తి అయినట్టు ఎలా సంకేతాలు ఇస్తారు?
Pope Election Smoke: కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియను కాన్క్లెవ్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ ద్వారా చర్చి సంప్రదాయలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరుగుతుంది.

Pope Election Smoke: క్యాథలిక్ చర్చి 266 పోప్ ఫ్రాన్సిస్ మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన వారసుడు ఎవరు? ఆ వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియను కాన్క్లెవ్ అని అంటారు. కాన్‌క్లెవ్ అనే ప్రక్రియ ద్వారా చర్చి సంప్రదాయల ప్రకారం ఈ ఎన్నిక జరుగుతుంది.
కాన్ క్లెవ్ అంటే ఏంటీ?
కాన్ క్లెవ్ అనేది కమ్ క్లావిస్ అనే పదం నుంచి వచ్చిన మాట. ఇది లాటిన్ భాషకు చెందిన పదం. అంటే తాళం వేసిన, లేదా కీతో మూసివేసిన అనే అర్థం. పోప్ ఎన్నిక కూడా ఇలా ప్రపంచ బాహ్య సంబంధాలను తెంచి వేసేలా అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఈ కాన్ క్లెవ్ ఎప్పుడు జరుగుతుందంటే పోప్ మరణించిన లేదా రాజీనామా చేసినా చర్చి లీడర్ షిప్ ఖాళీ అవుతుంది. దీన్నే సెడెవకాంటే అంటారు. అంటే సింహాసనం ఖాళీ అయినట్లు అని అర్థం. దీని కోసం కాన్ క్లెవ్ అవసరం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా కొత్త పోప్ ఎన్నిక చేపడతారు.
పోప్ ఎన్నికలో కార్డినల్స్ పాత్ర కీలకం
క్యాథలిక్ మతంలో పోప్ తర్వాత అత్యంత శక్తివంతమైన, ప్రభావంతమైన వారు కార్డినల్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈక కార్డినల్స్‌ను పోప్ నియమిస్తారు. వీరు పోప్‌నకు సలహాలు ఇవ్వడం, ముఖ్య కార్యనిర్వహణ చర్యలు చేపడతారు. చర్చి ఉన్నతికి పాటుపడతారు. వీరు పోప్‌ను ఎన్నిక చేసే ప్రక్రియలో భాగస్వాములు. ప్రపంచవ్యాప్తంగా 252 మంది కార్డినల్స్ ప్రస్తుతానికి ఉన్నారు. వీరిలో పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన వారు 135 మంది మాత్రమే. 80ఏళ్లు దాటిన కార్డినల్స్ ఓటు హక్కు కోల్పోతారు. ఈ కార్డినల్స్ పోప్ ఎన్నికలో కీలక భాగస్వాములు. అత్యంత రహస్యంగా కాన్ క్లెవ్‌లో పాల్గొని కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక తంతు అంతా కార్డినల్స్ కాలేజి డీన్ లేదా సీనియర్ కార్డినల్ నిర్వహిస్తారు.
పోప్ ఎన్నిక ప్రక్రియ ఇలా జరుగుతుంది.
కార్డినల్స్ అంతా పోప్ మరణాంతరం 15- 20 రోజుల్లో వాటికన్ సిటీ చేరుకుంటారు. అక్కడ సిస్టైన్ చాపెల్‌లో ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నిక సమయంలో బాహ్య ప్రపంచంతో వీరికి ఎలాంటి సంబంధాలు ఉండవు. చాలా గోప్యంగా కొత్త పోప్ ఎన్నిక జరుగుతుంది. ఎలాంటి కమ్యూనికేషన్ సదుపాయల ఉండవు. వాటిని నిషేధిస్తారు. 80 ఏళ్ల లోపు కార్డినల్స్ ఈ ఎన్నికలో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోప్‌ను ఎన్నుకుంటారు. తాము పోప్‌గా ఎన్నుకోవాలకున్న వారి పేరును కాగితంపై రాసి ఒక పాత్రలో వేస్తారు. ఓటింగ్ ఉదయం, మధ్యాహ్నం ఇలా రెండు రౌండ్లపాటు జరుగుతుంది. ప్రతీ సెషన్‌లో రెండు రౌండ్ల ఓటింగ్ పద్ధతిని ఇక్కడ అమలు చేస్తారు. కొత్త పోప్ ఎన్నికకు మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలి.
ఎవరూ మెజార్టీ సాధించకపోతే, కొద్ది రోజులు అంటే 13 రోజులు లేదా 30 రౌండ్లు గడిచినా మెజార్టీ సాధించకపోతే అప్పుడు సాధారణ మెజార్టీ ద్వారా అంటే 50శాతం ఓట్లు సాధించిన వారు పోప్‌గా ఎన్నికవుతారు. ఓట్లను సీనియర్ కార్డినల్స్ లెక్కిస్తారు. ప్రతీ ఓటు అందరికీ వినపడేలా గట్టిగా అరచి చదవడం సంప్రదాయం. ఓట్ల లెక్కింపు తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ ను కాల్చి వేస్తారు.
పోప్ ఎన్నికైతే తెల్లటి పొగ ద్వారా సంకేతాలు
పోప్ ఎన్నిక పూర్తైన తర్వాత ఆ ఫలితాలు అందరికి తెలిసేలా పొగను వదిలి ప్రపంచానికి తెలియజేయడం సంప్రదాయంగా వస్తుంది. ఎన్నిక జరిగిన సిస్టైన్ చాపెల్‌లో చిమ్మీ ద్వారా తెల్లటి పొగ ( వైట్ స్మోక్ ) వస్తే కొత్త పోప్ ఎన్నికైనట్లు సంకేతం. ఒక వేళ నల్లటి పొగ (బ్లాక్ స్మోక్) వస్తే ఎవరూ ఎన్నిక కాలేదని, ఇంకా ఎన్నిక ప్రక్రియ నడుస్తుందని సంకేతం. అయితే ఈ పొగను బ్యాలెట్ పేపర్ కాల్చడం ద్వారా ఏర్పడుతుంది. అయితే నల్లటి పొగ రావడానికి పోటాషియం క్లోరైడ్, తెల్లటి పొగ రావడానికి పొటాషియం నైట్రెట్ వంటి రసాయినాలను కలిపి కాలుస్తారు. ఈ నల్లటి, తెల్లటి పొగ ద్వారానే కొత్త పోప్ ఎన్నిక జరిగినట్లు ప్రపంచానికి తెలియజేస్తారు.
కొత్త పోప్‌నకు కొత్త పేరు నామకరణం.
కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ పూర్తైన తర్వాత ఈ తంతుకు నేతృత్వం వహించిన కార్డినల్స్ డీన్ ఆ ఎన్నికయిన పోప్‌ను కార్డినల్స్ నిర్ణయాన్ని అంగీకరించమని కోరడం సంప్రదాయం. ఆయన అంగీకారం తెలిపిన తర్వాత కొత్త పేరును పోప్ ఎంచుకుంటారు.
ప్రస్తుతం మరణించిన జార్జ్ మారియో 2013లో ఎన్నిక సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ పేరును ఎంచుకుని తన పేరును పోప్ ఫ్రాన్సిస్‌గా మార్చుకున్నారు. ఇది ముగిశాక సెయింట్ పీటర్ బసిలికా బాల్కానీ నుంచి పోప్ తన ఆశీస్తులు అందజేస్తారు. ఇదే కొత్త పోప్ ప్రపంచానికి పరిచయం అయ్యే రివాజు. దీన్ని మీడియా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలియజేస్తారు.





















