Pope Francis: పోప్ మరణాన్ని ఎవరు నిర్ధారిస్తారు? అంత్యక్రియలు ఎప్పుడు, ఎలా చేస్తారు?
Pope Francis Funeral: శతాబ్ధాల నాటి సంప్రదాయల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను క్యాథలిక్ చర్చి నిర్వహిస్తుంది. కానన్ లా ప్రకారం ప్రక్రియను తొమ్మిది రోజుల వ్యవధిలో నిర్వహిస్తారు.

Pope Francis News Today: శతాబ్ధాల నాటి సంప్రదాయల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను క్యాథలిక్ చర్చి నిర్వహించనుంది. క్యాథలిక్ చర్చి కానన్ లా, సంప్రదాయల ప్రకారం పోప్ అంత్యక్రియలను నిర్వహిస్తారు. సాధారణంగా పోప్ మరణిస్తే నవమి దినాలు అంటే తొమ్మిది రోజుల వ్యవధిలో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
పోప్ మరణం నిర్థారించేది ఇలా
పోప్ మరణిస్తే దాన్ని కామెర్లెంగో ప్రకటిస్తారు. కామెర్లెంగో అంటే క్యాథలిక్ చర్చి వ్యవహారాలను తాత్కాలికంగా నిర్వహించే నిర్వాహకుడు. అతను మాత్రమే పోప్ మరణాన్ని అధికారికంగా నిర్థారించి ధృవీకరిస్తారు. గతంలో పోప్ మరణాన్ని ఎలా నిర్థారించే వారంటే పోప్ తలను వెండి సుత్తితో తాకుతూ, పోప్ బాప్టిజం పేరును మూడు సార్లు పిలిచి ఆ తర్వాత పోప్ మరణించినట్లు నిర్థారించే వారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయం కొనసాగడం లేదు. ఆయన మరణించారని నిర్థారించిన తర్వాత వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బాసిలికాలో గంటలు మోగిస్తారు. పోప్ అధికారిక రింగ్, సీల్‌ను ధ్వంసం చేస్తారు. పోప్ అధికారిక పత్రాలపై సంతకం లేకుండా ఉండటానికి వీటిని ధ్వంసం చేస్తారు. పోప్ మరణాన్ని ప్రజలు తెలుసుకునేందుకు అధికారికంగా ప్రకటన చేస్తారు.
అంత్యక్రియలు ఎలా చేస్తారంటే..
కామెర్లోంగో పోప్ మరణాన్ని అధికారికంగా ధృవీకరించాక ఆయన శరీరాన్ని శుభ్రపరచి సంప్రదాయ దుస్తులతో అంటే ఎరుపు రంగు వస్త్రాలు, తెల్లటి క్యాసిక్, మెజెట్టా వంటి దుస్తులతో అలంకరణ చేస్తారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్ బసిలికాలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తారు. ప్రజలు నేరుగా వచ్చి చూడలేని వారి కోసం వాటికన్ టెలివిజన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తొమ్మిది రోజుల సమయంలో సంప్రదాయలకనుగుణంగా అంత్యక్రియలు, ప్రార్థనలు నిర్వహిస్తారు.
తొలి 2-3 రోజుల్లోనే ప్రజలు, బిషప్స్, దేశాధినేతలు, కార్డినల్స్ వంటి వారు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో ప్రతీ రోజు పోప్ ఆత్మశాంతి నిమిత్తం మాస్ (ప్రార్థనలు) ఆయా చర్చిల బిషప్స్, కార్డినల్స్ నిర్వహిస్తారు. పోప్ మరణం తర్వాత నాలుగు నుంచి ఆరు రోజుల పాటు అంత్యక్రియలకు సంబంధించిన ప్రార్థనలు సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. ఇవన్నీ సెయిట్ పీటర్ స్వ్కేర్‌లో జరుపుతారు. వీటికి కార్డినల్స్ కాలేజ్ డీన్ లేదా సీనియర్ కార్డినల్ నేతృత్వం వహిస్తారు.
సంతాపం తెలిపేదిలా..
ఈ సమయంలో కార్డినల్స్, బిషప్‌లు తమ సంతాపాన్ని తెలిపేలా ఊదారంగు వస్త్రాలు ధరిస్తారు. ఇవన్నీ ముగిసాక పోప్ భౌతిక కాయాన్ని శవపేటికలో ఉంచుతారు. అయితే మూడు శవపెటికల్లో ఉంచడం సంప్రదాయం. మొదటి శవపేటికను సైప్రస్ కలపతో చేస్తారు. ఇది నిరాడంబరతకు సూచనగా చెప్తారు. రెండో శవపేటికను సీసంతో తయారు చేస్తారు. ఇందులో పోప్ ఎంత కాలం పని చేశారు. ఆయన వివరాలను పొందుపరుస్తారు. ఇక మూడో శవపేటికను ఓక్ కలపతో చేస్తారు. ఇది బయట నుంచి సెఫ్టీ కోసం తయారు చేసిన శవపేటిక ఈ మూడింటిలో పెట్టి ఖననం చేస్తారు. చాలా మంది పోప్‌లు సెయింట్ పీటర్ బసిలికా కింద ఉన్న వాటికన్ గ్రోట్టోస్లోలో ఖననం చేసిన చరిత్ర ఉంది. మరి కొందరు వారి స్వస్థలాల్లోను, కొన్ని పవిత్ర స్థలాల్లో చేయమని కోరిన సందర్భాలు ఉన్నాయి.






















