YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
Andhra Pradesh News | ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో 50 స్థానాల్లో 39 చోట్ల వైసీపీ నేతలే విజయం సాధించారని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

YS Jagan Mohan Reddy | రాప్తాడు: వైసీపీ కార్యకర్త లింగమయ్యను దారుణంగా హత్య చేశారు, ఆ కుటుంబానికి అండగా నిలవాలని రాప్తాడుకు వచ్చినట్లు తెలిపారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఇటీవల లింగమయ్య హత్యకు గురయ్యాడని తెలిసిందే. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. పాపిరెడ్డి పల్లెకు వచ్చి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఊడిగం చేసే పోలీసులు అందుకు అంతకంత అనుభవిస్తారు. మా ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటాం. గతంలో బిహార్ గురించి మాట్లాడేవాళ్లం. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితి చూస్తే ఇకనుంచి మన రాష్ట్రం గురించి అలాగే మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. రెడ్ బుక్ పాలన ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయం
57 చోట్ల ఎన్నికలు జరిగాయి. జడ్పీడీసీ, నగరపాలక, కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్, ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే తనకు ప్రతికూలంగా ఉన్న 7 చోట్ల చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేపించారు. 50 చోట్ల అనివార్య పరిస్థితులతో ఎన్నికలు నిర్వహించాల్సి రాగా, అందులో 39 చోట్ల వైసీపీ గెలిచింది. ఏ చోట చంద్రబాబుకు బలం లేదు. అందుకే వైసీపీ నేతల్ని తమ పార్టీలో చేర్చుకున్నారు. ఆ నేతలే ఎన్నికల్లో గెలిచారు. ఒక్క జడ్పీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, ఉప సర్పంచ్ పదవి పోతే ఏమవుతుంది.
పదవుల కోసం ముఖ్యమంత్రి అనే హోదాతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రామగిరిలో 10 మందిలో 9 ఎంపీటీసీలు వైసీపీ, ఒక్క సభ్యుడు టీడీపీ. కానీ గెలిచించి టీడీపీ సభ్యుడు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, నేతల్ని ప్రలోభాలు, భయపెట్టి పదవులు దక్కించుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని, తమకు సెక్యూరిటీ కావాలని కోర్టును ఆదేశిస్తే.. 8 మంది ఎంపీటీసీలను తీసుకొస్తుంటే వాళ్లను రామగిరి ఎస్సై సాయంతో ఎమ్మెల్యే, వారి కొడుకుతో వీడియో కాల్ చేయించారు. భారతమ్మ అనే ఎంపీటీసీ తల్లిదండ్రులు మా వద్ద ఉన్నారు. మాకు అనుకూలంగా ఓటు వేయకపోతే తల్లిదండ్రులు తిరిగిరారని భయపెట్టారు.
బేస్ బాల్ స్టిక్ తో కొట్టడంతో మృతి
మద్దతు లేకున్నా వైసీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టి.. కుటుంబాలను చంపేస్తామని బెదిరించి కొన్ని స్థానాల్లో టీడీపీ గెలిచింది. కానీ కూటమి శ్రేణులు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత నెల 27, 28న దాడులు జరిగాయి. మార్చి 30న బైకు మీద వెళ్తుంటే లింగమయ్య కొడుకుపై దాడి చేశారు. తనను కొడుతున్నారని ఫోన్ చేసి లింగమయ్యకు చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి చెబుతావా అంటూ కొందరు బేస్ బాల్ స్టిక్స్ తో వెళ్లి దాడిచేసి కొట్టగా లింగమయ్య ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రం పరిస్థితులు గతంలో బిహార్ కంటే దారుణంగా తయారవుతోంది. తమపై దాడులు చేశారని, హత్య చేశారని ఫిర్యాదు చేస్తే ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టారు. కీలక సూత్రధారి రమేష్ నాయుడిపై కేసు ఎందుకు పెట్టలేదు.
ఎమ్మెల్యేను, వాళ్ల కుమారుడిపై మాత్రం పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేవు. ఎస్సై సుధాకర్ వీడియో కాల్స్ ద్వారా ఎంపీటీసీలను ప్రలోభపెట్టి, భయపెడితే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఎస్సై ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ రికార్డులను పరిశీలించలేదు.లింగమయ్య భార్యను బెదిరించి ఓ కాగితంపై వేలిముద్ర పెట్టించారు. అందులో ఏం రాశారో ఆమెకు తెలియదు. బేస్ బాల్ బ్యాటుతో కొట్టి చంపినట్లు ఎక్కడా రాయలేదు. చిన్న కర్రతో కొట్టారని కేసులో పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. వీళ్లకు కావాల్సిన వారిని సాక్షులుగా చేర్చి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

