Jagan Tour High Tension: జగన్ పర్యటనతో అనంతపురంలో హైటెన్షన్.. రాప్తాడులో పోలీసుల భారీ బందోబస్తు
Andhra Pradesh News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనతో అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రాప్తాడు వెళ్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ అనంతపురం జిల్లాకి రానున్నారని జిల్లా వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ వస్తున్నారని నలుగురు ఎస్పీలతో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో జరిగిన ఒక హత్యతో పొలిటికల్ హిట్ నడుస్తోంది.
వైసిపి కార్యకర్త లింగమయ్యను పరిటాల కుటుంబమే హతమార్చిందని వైసిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ప్రత్యక్షంగానే వైసిపి నేతలు ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు పాపిరెడ్డిపల్లి గ్రామాని రానున్నారు.
పరిటాల వర్సెస్ తోపుదుర్తి వార్:
పాపిరెడ్డి పల్లెలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది. గతంలో జరిగిన రక్తచరిత్రను మరొకసారి తలపించే విధంగా ఈ ఇద్దరు నేతలు కూడా ప్రెస్మిట్లు పెట్టి మరి సవాల్ విసురుతున్నారు. టీవీ బాంబా కారు బాంబుగతంలో ఎవరు పెట్టారంటూ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హత్య రాజకీయాలు ప్రోత్సహించడంలో పరిటాల కుటుంబానికి ముందు నుంచి అలవాటే అని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఆరోపించడంతో.. ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో మరొకసారి ఫ్యాక్షన్ కక్షలు గుర్తుచేస్తూ రాజకీయ పబ్బం గడపాలని తోపుదుర్తి బ్రదర్స్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం పోయినప్పుడు మరొకల వ్యవహరించడం తోపుదుర్తి బ్రదర్స్ కి అలవాటుగా మారిందన్నారు.
LIVE: YSRCP Chief YS Jagan Consoles Kuruba Lingamaiah Family | YS Jagan Raptadu Tour https://t.co/Mln3GvPIsQ
— YSR Congress Party (@YSRCParty) April 8, 2025
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అడ్డుకుంటారా..?
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనేతలు అడ్డుకుంటారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గతంలో పరిటాల రవీంద్రపులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అడ్డుకున్నట్లు ఆపార్టీనేతలు కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకి వస్తున్న నేపథ్యంలో జగన్ ని అడ్డుకోవాలని తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే పరిటాల సునీత అలాంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదని పార్టీ కార్యకర్తలకు ఆదేశించారు. ఈ క్రమంలోనే పరిటాల సునీత కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ రెడ్డి లింగమయ్యకుటుంబాన్ని పరామర్శించి వెళ్లొచ్చని కానీ అనవసంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
రాప్తాడులో పోలీసులు అత్యుత్సాహం
— YSR Congress Party (@YSRCParty) April 8, 2025
వైయస్ జగన్ గారి పర్యటన నేపథ్యంలో.. కూటమి నేతల కపట ఆదేశాలతో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరూ రాకుండా అడ్డుకునే కుట్ర
ఎన్.ఎస్ గేటు వద్ద పోలీసు వాహనాలు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలు నిలిపివేత
మరీ ఇంత భయం ఎందుకు @ncbn ?#YSRCPCadre#CBNFailedCM… pic.twitter.com/IZDeRi0jyB
రాప్తాడులో భారీ బందోబస్తు:
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో జగన్ వస్తున్న సందర్భంగా పోలీసులు భారీబందోబస్తును ఏర్పాటు చేశారు. రామగిరిమండలం పాపిరెడ్డి పల్లికి వెళ్లాలంటే చిన్న ఇరుకుదారులు ఉండడంతో పోలీసులు హెలిపాడ్ ను పాపిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయించారు. లింగమయ్య ఇంటి వద్దకు వెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డి తో పాటు అనుమతి ఉన్న నేతలను మాత్రమే వెళ్లాలని సూచించారు. ఇప్పటికే రాప్తాడు, రామగిరి పాపిరెడ్డిపల్లి గ్రామాలలో నలుగురు ఎస్పీలతో గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

