Allu Arjun - Jr NTR: "హ్యాపీ బర్త్ డే బావా"... ఎన్టీఆర్ స్పెషల్ విషెష్... బన్నీ కోసం తారక్ ఏం కోరుకున్నాడో తెలుసా?
Allu Arjun - Jr NTR : నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా విష్ చేశారు. "హ్యాపీ బర్త్ డే బావా" అంటూ ఎక్స్ లో తారక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ 43వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు అగ్ర తారల నుంచి ఐకాన్ స్టార్ కు బర్త్ డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి. బన్నీకి ఆప్తుడైన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
బన్నీకి తారక్ బర్త్ డే విషెస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'బావ' అంటూ బన్నీకి స్పెషల్ విషెస్ తెలియజేశారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ. ఈ సంవత్సరం నీకు మరింత శక్తి, ప్రేమతో పాటు మరిన్ని మైల్ స్టోన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా" అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ "బావ నీ లవ్లీ విషెస్ కు థాంక్స్. నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నా" అంటూ రిప్లయ్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.
బన్నీ - తారక్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇప్పుడే కాదు ప్రతి ఏడాది బన్నీ బర్త్ డేకి తారక్ తప్పకుండా విష్ చేస్తారు. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉండడంతో బావా అని పిలుచుకుంటారు. అందుకే ఇద్దరి హీరోల అభిమానులు కూడా ఇప్పుడు బన్నీ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఇద్దరూ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు.
Many happy returns of the day Bava @alluarjun… May this year bring you more power, love, and milestones…
— Jr NTR (@tarak9999) April 8, 2025
అట్లీ సూపర్ హీరోగా అల్లు అర్జున్
అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ఎట్టకేలకు వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో లాస్ ఏంజిల్స్‌లోని VFX స్టూడియోలో బన్నీ, అట్లీ సందడి చేయడం కన్పించింది. ఇందులోనే అల్లు అర్జున్ కు స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించబోతున్న ఈ సినిమాకు హాలీవుడ్ ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు వర్క్ చేయనున్నారు. వారిలో 'స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్', 'కెప్టెన్ అమెరికా: సివిల్ వార్', 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్'కు వర్క్ చేసిన ఐరన్ హెడ్ స్టూడియో సీఈవో, ఆర్ట్ డైరెక్టర్ జోస్ ఫెర్నాండెజ్... 'జిఐ జో: రిటాలియేషన్', 'ఐరన్ మ్యాన్ 2' వంటి చిత్రాలకు పనిచేసిన VFX సూపర్‌వైజర్ జేమ్స్ మాడిగన్ ఉన్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా ఇదొక సై-ఫై జానర్ లో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ సూపర్ హీరో మూవీ అనే ప్రచారం మొదలైంది.





















