అన్వేషించండి

Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు

TGBIE: తెలంగాణలో ఇంటర్ వార్షికల పరీక్షల ఫలితాలను ఏఫ్రిల్ 22న ప్రకటించనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

Telangana Inter Results 2025: తెలంగాణలో ఇంటర్ వార్షికల పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న వెల్లడికానున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్యా్హ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చూసుకోవచ్చు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో వీరిలో 4,80,415 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా... 4,44,697 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను వెల్లడించనుండటం విశేషం. 

 

https://telugu.abplive.com/

https://tgbie.cgg.gov.in/ 

 

తెలంగాణ ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంక ప్రక్రియ వారం కిందటే పూర్తికాగా.. మార్కులను డిజిటలైజ్ ప్రక్రియ తాజాగా ముగిసింది.  ఇంటర్ ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా జవాబుపత్రాల మూల్యాంకనంలో ఈసారి ముందస్తు పునఃపరిశీలన చేసింది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కులు సరిగా రాలేదని, లెక్చరర్లు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలో 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను చీఫ్‌ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో క్షుణ్నంగా పునఃపరిశీలన చేయించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుందని వారంటున్నారు.

ఏప్రిల్‌ 10 నాటికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. ఫలితాలను ఏప్రిల్‌ 22న వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల మార్క్‌లిస్ట్‌లు రెడీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయింది. విద్యాశాఖ మంత్రి సమయం ఇచ్చినదాని బట్టి వచ్చే వారం విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. 

2024 మినహా ఎప్పుడు కూడా తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేసింది లేదు. గతేడాది ప్రభుత్వంతో సంబంధం లేకుండా అధికారులే నేరుగా విడుదల చేశారు. ఎన్నికలు ఉన్నందున అధికారులు ఫలితాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం ఉంది. దాని కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

ఏ సంవత్సరంలో ఎప్పుడు ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయో పరిశీలిస్తే... 2021లో జూన్ 28, 2022 జూన్ 28, 2023మే9, 2024 ఏప్రిల్‌ 24న ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది కంటే ఒకట్రెండు రోజులు ముందుగానే రిజల్ట్స్‌ విడుదల చేయనున్నారు. 

గతేడాది ఫలితాలు ఇలా..
గతేడాది ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 72.53 శాతం ఉంటే, బాలురు 56.1 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు టాప్‌లో నిలిచింది. 44.29 శాతంతో కామారెడ్డి ఆఖరి స్థానంలో ఉంది.  మొదటి సంవత్సరం 60.01 శాతం మంది పాస్ అయ్యారు. ఇందులో ఇందులో బాలికలు 68.35 శాతం ఉంటే బాలురు 51.5 శాతం మంది పాస్ అయ్యారు. టాప్‌లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతంతో టాప్‌లో ఉంటే కామారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో 34.81 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Embed widget