అన్వేషించండి

Fire Colours: చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?

Fire Colours: మానవ జీవితంలోని ఐదు అంశాలలో అగ్ని ఒకటి. మానవులకు ప్రతిరోజూ అగ్ని అవసరం. సరళంగా చెప్పాలంటే, అగ్ని రోజువారీ జీవితంలో ఒక భాగం. కానీ అగ్నికి వేర్వేరు రంగులు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంట రంగు ఉష్ణోగ్రత, మండే పదార్థాలను బట్టి మారుతుంది.
  • ఎరుపు రంగు మంట 500 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది.
  • నారింజ, ప్రకాశవంతమైన ఎరుపు రంగు మంట 1000 డిగ్రీల వరకు ఉంటుంది.
  • గ్యాస్ స్టవ్ మంట నీలం రంగులో ఉండటానికి కార్బన్ తక్కువగా ఉండటమే కారణం.

Fire Colours: మనం ప్రతి రోజూ నిప్పును చూస్తుంటాం. ఉదయం టీ పెట్టే దగ్గర నుంచి రాత్రి భోజనం వండే వరకు మనకు నిప్పుతో విడదీయలేని సంబంధం ఉంది. అసలు మానవ జీవితంలోని ఐదు ముఖ్యమైన అంశాల్లో నిప్పు ఒకటి. మనకు ప్రతి రోజూ నిప్పు అవసరం. అది మన నిత్య జీవితంలో భాగమైపోయింది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? కట్టెల పొయ్యి వెలిగించినప్పుడు మంట ఒక రంగులో ఉంటుంది. గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మంట మరో రంగులో ఉంటుంది. నిప్పు కనిపెట్టడం వెనుక మనిషికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కానీ మంటలకు వేర్వేరు రంగులు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? 

మంట రంగులు ఎందుకు మారుతుంటాయి?

మనం మంట మండుతున్నప్పుడు దాని రంగును కచ్చితంగా గమనించే ఉంటాం. కట్టెల మంట, ఎల్పీజీ మంట, ప్లాస్టిక్ మంట అన్ని వేర్వేరు రంగుల్లో ఉంటా. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ మంట ఎంత వేడితో మండుతోంది. రెండు ఆ మంటలో ఏయే పదార్థాలు మండుతున్నాయి. 

చాలా సింపుల్‌గా చెప్పాలంటే మంట రంగు అది ఎంతే వేడిగా ఉందో నేరుగా తెలియజేస్తుంది. అంటే మంట రంగును చూసి అది ఎంత వేడిని ఇస్తుందో మనం  గుర్తించవచ్చు. 

ఎరుపు రంగు;- ఒక వేళ మంట ఎరుపు రంగులో కనిపిస్తుంటే, దాని ఉష్ణోగ్రత 500 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉన్నట్టు అర్థం. 

నారింజ రంగు లేదా ప్రకాశవంతమైన ఎరుపు: మంట నారింజ రంగులో లేదా బాగా మెరుస్తున్న ఎరుపు రంగులో ఉంటే అక్కడ వేడి వెయ్యి డిగ్రీల వరకు ఉందని అర్థం. 

పసుపు రంగు: ఒక వేళ మీకు పసుపు, నారింజ రంగు కలిసిన రంగులో మంట కనిపిస్తే అక్కడ ఉష్ణోగ్రత 1100 నుంచి 1200 డిగ్రీల వరకు ఉంటుంది. 

గ్యాస్ స్టౌవ్‌ మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది?

మీ ఇంట్లోని ఎల్పీజీ గ్యాస్ స్టౌవ్‌ వెలిగించినప్పుడు మంట నీలం రంగులో ఉండటానికి ప్రత్యేక కారణం ఉంది. ఇలా జరగడానికి అతి ముఖ్‌మైన కారణం ఆ వాయువులో కార్బన్ పరిమాణం తక్కువగా ఉండటం. వంట గ్యాస్‌లో కార్బన్ తక్కువగా ఉంటుంది. కాబ్టి అది గాలితో కలిసినప్పుడు చాలా స్వచ్ఛంగా, ఎక్కువ వేడిని ఇస్తూ మండుతుంది. అందుకే ఆ మంట నీలం రంగులో కనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా ఏదైనా ఇంధనంలో ఎక్కువ కార్బన్ ఉంటే, ఆ మంట ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.

Frequently Asked Questions

మంట రంగు మారడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

మంట రంగు మారడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి: మంట ఎంత వేడిగా మండుతోంది మరియు ఆ మంటలో ఏయే పదార్థాలు కాలుతున్నాయి.

ఎరుపు రంగు మంట ఎంత వేడిగా ఉంటుంది?

మంట ఎరుపు రంగులో కనిపిస్తుంటే, దాని ఉష్ణోగ్రత 500 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉందని అర్థం.

గ్యాస్ స్టవ్ మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది?

గ్యాస్ స్టవ్‌లో కార్బన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది గాలితో కలిసినప్పుడు స్వచ్ఛంగా, ఎక్కువ వేడిని ఇస్తూ మండుతుంది, అందుకే నీలం రంగులో కనిపిస్తుంది.

నారింజ లేదా ప్రకాశవంతమైన ఎరుపు రంగు మంట ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?

మంట నారింజ రంగులో లేదా బాగా మెరుస్తున్న ఎరుపు రంగులో ఉంటే, అక్కడ వేడి వెయ్యి డిగ్రీల వరకు ఉందని అర్థం.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget