NEET PG 2025 నోటిఫికేషన్ విడుదల- జూన్ 15న పరీక్ష, ఎలా అప్లై చేయాలంటే?
NEET PG Notification 2025: NEET PG 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను NBE ప్రకటించింది.

NEET PG Notification 2025: 2025-26 విద్యాసంవత్సరం కోసం డీఎండీ, ఎంఎస్, పీజీ పిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET PG 2025కి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్‌బీఈ విడుదల చేసింది. natboard.edu.in and nbe.edu.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను అప్‌లోడ్ చేసింది. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు వివరాలు, ఎవరు అప్లై చేయవచ్చు. పరీక్ష ఎప్పుడు లాంటి పూర్తి వివరాలను అందులో ఉంచింది.
NEET PG పరీక్షను అప్లై చేయాలనుకునే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా NBE గైడ్‌లైన్స్ చదివి అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను NEET PG బ్రోచెర్‌లో ఇచ్చారు.
NEET PG 2025కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే
NEET PG 2025కి అప్లై చేయాలనుకునే విద్యార్థులు ఈ తేదీలను గుర్తు పెట్టుకోవాలి. NEET PG 2025 రిజిస్ట్రేషన్ April 17 నుంచి ప్రారంభమవుతుంది. May 7 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. NEET PG ఎగ్జామ్ జూన్ 15న నిర్వహిస్తారు. NEET PG ఎగ్జామ్ ఫలితాలు జులై 15న విడుదల చేశారు.
NEET PG 2025 రాయాలనుకునే విద్యార్థులు ఎలా అప్లై చేయాలి
NEET PG 2025 రాయాలనుకునే విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అయితే అప్లై చేయడం చాలా ఈజీ. అప్లై చేయడానికి ముందు అభ్యర్థులు కచ్చితంగా బ్రోచెర్‌ను చదవాల్సి ఉంటుంది.
స్టెప్ 1- ముందు విద్యార్థులు nbe.edu.inకు వెళ్లాలి. (ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే నేరుగా అప్లికేషన్ పేజ్‌కు వెళ్లిపోవచ్చు)
స్టెప్ 2- అందులో కనిపించే NEET-PG అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. (ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే నేరుగా అప్లికేషన్ పేజ్‌కు వెళ్లిపోవచ్చు)
స్టెప్ 3- ఆ తర్వాత అందులో అడిగే వివరాలను ఎంటర్ చేయాలి. అంటే పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఇవ్వాలి.
స్టెప్ 4- పైన చెప్పిన వివరాలు ఇస్తే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు, మెయిల్ ఐడికి పంపుతారు.
స్టెప్ 5- ఇప్పటి వరకు చెప్పింది కేవలం NEET PG 2025 అప్లికేషన్‌లోకి లాగిన్ అయ్యేందుకు మాత్రమే. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వస్తే వాటి ఆధారంగా మీరు NEET PG 2025 అప్లికేషన్ ఫామ్ పేజ్‌లోకి లాగిన్ అవ్వగలరు.
స్టెప్ 6- అక్కడ మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 7- ఆ వివరాలు పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించేందుకు ఆప్షన్ అడుగుతుంది.
స్టెప్ 8- ఫీజు చెల్లించిన తర్వాత మరిన్ని వివరాలు అడుగుతుంది. వాటిని కూడా ఇచ్చి అప్లికేషన్ పూర్తిగా మరోసారి చూసి సబ్‌మిట్ కొట్టాలి.
మరిన్ని వివరాలు
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏప్రిల్ 17న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. మే 7 అర్థరాత్రి 11.55 నిమిషాల వరకు రిజిస్ట్రేషన్ కావచ్చు.
జూన్ 15న కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు షిప్టుల్లో ఉంటుంది.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. మధ్యాహ్నం షిఫ్టు పరీక్ష 3.30 నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది.
ఎవరు అర్హులు: ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు లేదా ఫైనల్ ఇయర్ పరీక్ష రాసిన వాళ్లు అర్హులు. జులై 31 నాటికి ఒక సంవత్సరం తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. లేదా పూర్తి చేసే అవకాశమైనా ఉండాలి. జాతీయ వైద్య కమిషన్ లేదా రాష్ట్ర వైద్య మండలి జారీ చేసిన శాశ్వత, లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనిక వయోపరిమితి ఏం లేదు.
అప్లికేషన్ ఫీజు ఎలా చెల్లించాలి?
దరఖాస్తు ఫీజును నెట్‌బ్యాకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐలో ఎలాగైనా చెల్లించవచ్చు. గతేడాది పరీక్ష ఆధారంగా జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 3500 వరకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 2500 వరకు ఫీజు ఉంటుందని అంటున్నారు.





















