NEET UG Correction: నీట్ యూజీ దరఖాస్తుల సవరణకు అవకాశం, రేపటితో ముగియనున్న గడువు
NEET UG: నీట్ యూజీ 2025 పరీక్షకు సంబంధించి దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. విద్యార్థులు మార్చి 9 నుంచి 11 వరకు వివరాల్లో మార్పులుంటే సరిచేసుకోవచ్చు.

NEET UG 2025 Correction Window: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (నీట్ యూజీ 2025) పరీక్షకు సంబంధించి దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మార్చి 9 నుంచి 11 వరకు ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. మార్చి 7తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. నీట్ యూజీ పరీక్షను మే 4న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్చి 9, 2025 నుండి NEET UG 2025 దరఖాస్తుల సవరణ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సవరణ విండో మార్చి 11, సమయం 11:50 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
NEET UG 2025 దరఖాస్తులో అభ్యర్థులు కింది వివరాలను సవరించుకోవచ్చు..
✡ వ్యక్తిగత వివరాలు: పేరు, పుట్టిన తేదీ, లింగం, కేటగిరీ, సబ్-కేటగిరీ (PwD), రాష్ట్ర కోడ్, జాతీయత.
✡ పరీక్షా నగరం ఎంపిక: పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకోవచ్చు.
✡ అర్హత వివరాలు: అభ్యర్థుల విద్యార్హత వివరాలను సవరించుకోవచ్చు.
✡ ఫోటో మరియు సంతకం: అప్‌లోడ్ చేసిన ఫోటో లేదా సంతకం తప్పుగా ఉంటే, వాటిని సవరించుకోవచ్చు.
దరఖాస్తుల సవరణ ఇలా..
✡ NTA అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి వెళ్లండి.
✡ విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
✡ కరెక్షన్ ఫారమ్' లేదా 'ఆప్లికేషన్ ఫారమ్' లింక్ మీద క్లిక్ చేయాలి.
✡ వివరాల్లో తప్పులుంటే మార్చుకోవాలి. అవసరమైన మార్పులు చేసుకోవాలి.
✡ మార్పులను సేవ్ చేసిన తర్వాత SUBMIT చేయాలి.
✡ సమర్పించిన తర్వాత, సవరించిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొకి భద్రపరచుకోవాలి
పరీక్ష విధానం..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్(National Eligibility cum Entrance Test) యూజీ (NEET UG 2025) పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంతో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయం 180 నిమిషాలు(3 గంటలు) ఉండనుంది. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది.
ఈ కోర్సుల్లో ప్రవేశాలు..
నీట్ ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు.. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్ (BHMS) కోర్సులో ప్రవేవాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్‌డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్‌లో బీఎస్సీ నర్సింగ్ (BSc Nursing) కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

