అన్వేషించండి

ABP Desam Smart Ed Conclave: చదువుతోనే యువత జీవితాలు మారుతాయి - ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌ కాన్‌క్లేవ్‌లో సీతక్క స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు

Seetakka: ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్‌కాన్క్లేవ్ లో మంత్రి సీతక్క యువతకు కీలక సందేశం ఇచ్చారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదేది ఉండదన్నారు.

Minister Seethakka: పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ ఉండదని.. తెలంగాణ మంత్రి సీతక్క యువతకు స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పారు. దానికి తన జీవితమే ఉదాహరణగా చెప్పారు. చాలా చిన్న వయసులోనే నక్సల్ ఉద్యమంలోకి వెళ్లానని కానీ..నేడు మంత్రిగా ఉన్నానని.. విద్యాపరంగా పీహెచ్‌డీ కూడా పూర్తి చేశానని..రెండో పీహెచ్‌డీ కోసం చదువుతున్నానని తెలిపారు. ఏబీపీ  దేశం నిర్వహించిన స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్‌కు ముఖ్య అతిధిగా సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ఫూర్తిగాయకంగా సదస్సుకు హాజరైన విద్యార్థులకు జీవిత పాఠాలు వివరించారు.

చదువు మార్చిన జీవితం

చదువుతో దేన్ని అయినా మార్చవని సీతక్క చెప్పారు.  మనం మన కుటుంబాలతో పాటు సమాజాన్ని అభివృద్ధి చేయగలమన్నారు. తన జీవితం అడవుల్లో ప్రారంభమయిందని గుర్తు చేసుకున్నారు. తనను ఎన్ కౌంటర్ చేయాలనుకున్నారని  కానీ తప్పించుకున్నానన్నారు. ఒకప్పుడు  మావోయిస్టుగా తనను  నిలబెట్టిన బోనులోనే..లాయర్  గా ప్రాక్టీస్ చేశానని గుర్తు చేసుకున్నారు. తరవాత  ప్రజా  జీవితంలోకి వచ్చానని.. ఇప్పుడు  మంత్రిగా ఉన్నానని తెలిపారు. చదువే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని స్పష్టం చేశారు.   

 అడవి నుంచి అసెంబ్లీకి  ఒక పోరాట ప్రయాణం 

తన జీవిత ప్రయాణం అడవుల్లో ప్రారంభమైందని గుర్తుచేసుకున్న సీతక్క, ఆ రోజుల్లో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించారు. ఒకానొక సమయంలో పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేయాలని చూసినా, చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. గతంలో మావోయిస్టుగా ఏ బోనులో అయితే నిలబడాల్సి వచ్చిందో, చదువుకున్న తర్వాత అదే కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని ఆమె ఆవేదనతో కూడిన గర్వంతో పంచుకున్నారు. ఆ పరిణామ క్రమమే తనను ప్రజా జీవితంలోకి, ఆపై మంత్రి పదవికి చేర్చిందని వివరించారు.

 మార్పుకు ఏకైక మార్గం విద్యే 

చదువు ద్వారా మాత్రమే ఏదైనా సాధించవచ్చునని, సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావచ్చునని సీతక్క స్పష్టం చేశారు. విద్య అనేది కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదని, మన కుటుంబాలతో పాటు దేశాన్ని, సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తి దానికి ఉందని ఆమె ఉద్ఘాటించారు. అడవిలో తుపాకీ పట్టిన చేతులతోనే కలం పట్టి పీహెచ్‌డీ సాధించిన తన ప్రయాణం, చదువుకున్న వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యమని ఆమె విద్యార్థుల్లో భరోసా నింపారు.

 యువతకు సందేశం  సామాజిక బాధ్యత                            

నేటి తరం విద్యార్థులు కేవలం తమ ఎదుగుదల కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కూడా ఆలోచించాలని ఆమె పిలుపునిచ్చారు. కష్టాలను చూసి భయపడకుండా, విద్యను ఆయుధంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఏబీపీ దేశం నిర్వహించిన ఈ వేదిక ద్వారా తన జీవిత పాఠాలను పంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, యువత తమ కలలను నిజం చేసుకునే క్రమంలో వెనకడుగు వేయకూడదని సీతక్క  సూచించారు.              

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
ABP Desam Smart ED Conclave 2026: ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
ఉద్యోగాలు లేవనేది అపోహేనా? AI యుగంలో విద్యార్థులు ఎలా సిద్ధమవ్వాలి? ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి కీలక సూచనలు!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget