Viral News: శివయ్య కళ్లు తెరిచాడు, అనుగ్రహిస్తాడంటూ ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఏపీలో ఘటన
శివయ్య కళ్లు తెరిచాడు, మమ్మల్ని అనుగ్రహిస్తాడంటూ భక్తులు ఆ ఆలయానికి పోటెత్తారు. స్వామిని దర్శించుకుని టెంకాయ కొట్టి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.

శివయ్య కళ్లు తెరిచాడు.. మమ్మల్ని అనుగ్రహిస్తాడు అంటూ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఘటన విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గం శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయంలో జరిగింది. శివుడు కళ్లు తెరిచాడని ఆనోటా ఈనోటా పాకి ప్రచారం జరగడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
గాజువాక నియోజకవర్గం ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. శివయ్య కళ్లు తెరిచాడని, తమను అనుగ్రహించి చల్లగా చూడాలంటూ ఆలయానికి భక్తులు కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మన దేశంలో ఇలాంటి వాటికి అసలు కొదువ ఉండదు. మూఢనమ్మకాలు ఎంత నమ్ముతామో, అంతకు కొన్నిరెట్లు ఎక్కువగా మత విశ్వాసాలు ఉంటాయి. ఆదివారం సాయంత్రం నుంచి స్వామి వారి కళ్ళు తెరిచారని ఆలయ సిబ్బంది తెలిపారు. మే 6న ఆలయంలో పెద్ద పండుగ ఉంటుందని పూజారి తెలిపారు.























