Patanjali News: ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్‌కు పోటీగా రోజ్ షర్బత్ - ఆ ఆదాయంతో పేద పిల్లలకు విద్య - పతంజలి ప్రకటన
Rose Sharbat: పతంజలి రోజ్ షర్బత్ మార్కెట్ లో ప్రజల్ని ఆకట్టుకుంటోందని పతంజలి తెలిపింది. ఈ రోజ్ షర్బత్ ఆరోగ్యాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చింది.

Rose Sharbat Challenges Artificial And Sugary Drinks: యోగా గురువు బాబా రాందేవ్ కంపెనీ పతంజలి రోజ్ షర్బత్ ను కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, చక్కెర అధికంగా ఉండే సాంప్రదాయ పానీయాలకు ప్రత్యామ్నాయంగా మారింది. ఈ షర్బత్ రుచికరంగానే కాకుండా రిఫ్రెష్ గా ఉంచుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ షర్బత్‌ను ఆయుర్వేద సూత్రాల ఆధారంగా తయారు చేస్తున్నట్లుగా పతంజలి తెలిపింది.
సాధారణంగా మల్టీ నేషనల్ కంపెనీల కూల్ డ్రింక్స్‌లో హానికరమైన కెఫిన్, సోడా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటి నుంచి దూరంగా ఉండటానికి మరియు సహజమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను స్వీకరించడానికి ప్రజలను ప్రోత్సహించడమే పతంజలి లక్ష్యం. అందుకే రోజ్ షర్బత్‌ను అందుబాటులోకి తెచ్చారు.
"పతంజలి దృష్టి కేవలం ఉత్పత్తులను అమ్మడం కాదు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా పేద, గిరిజన వర్గాలకు మద్దతు ఇవ్వడం కంపెనీ లక్ష్యం. ఈ లక్ష్యంతో, పతంజలి విద్యా రంగంలో కూడా పనిచేస్తోంది" అని కంపెనీ ప్రకటించింది. ఆరోగ్యకరమైన శరీరం , విద్యావంతులైన మనస్సు ఒక దేశాన్ని బలంగా మారుస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది. రోజ్ షర్బత్ వంటి ఉత్పత్తుల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని అటువంటి సామాజిక కారణాల కోసం ఉపయోగిస్తారు.
పతంజలి ఆయుర్వేదం వేసవిలో మండుతున్న వేడిలో తాజాదనం , ఆరోగ్యం ప్రత్యేకమైన కలయికతో భారతీయ పానీయాల పరిశ్రమలోకి అడుగుపెట్టింది. శీతల పానీయాలు తరచుగా కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేదుకు ప్రిజర్వేటివ్స్ , అదనపు చక్కెరతో నిండి ఉండే ఇతర బ్రాండ్‌లకు పోటీగా ఈ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకు వచ్చారు. ఆయుర్వేద , సహజ పదార్ధాలతో ఈ శీతల పానియాలు తయారు చేస్తారు.ఈ పతంజలి పానియాలు రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా అని పతంజలి పేర్కొంది.
రోజ్ షర్బత్ గురించి ప్రత్యేకత ఏమిటి?
రోజ్ షర్బత్ ఎంతో అమూల్యమైనదని పతంజలిసంస్థ ప్రకటించింది. " రోజ్ షర్బత్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా సహజ పదార్ధాలతో తయారు చేయశాం. ఇందులో గులాబీ రేకుల సారాలు ఉంటాయి., ఇవి రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని , తాజాదనాన్ని కూడా అందిస్తాయి. ఈ షర్బత్ వేసవిలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఇది దాహాన్ని తీర్చుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది." అని పతంజలి తెలిపింది. పతంజలి తన ఉత్పత్తులు ఆయుర్వేద పురాతన సంప్రదాయాలను ఆధునిక రూపంలో ప్రజలకు తీసుకువస్తాయని తెలిపింది.
ఆయుర్వేదాన్ని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని పతంజలి తెలిపింది. తద్వారా ఎవరూ అనారోగ్యకరమైన పానీయాల బారిన పడకుండా ఉంటారని.. అందుకోసమే తాము పని చేస్తున్నామన్నారు. "అణగారిన పిల్లలకు విద్యను అందించడం మరియు గిరిజన వర్గాలను ఉద్ధరించడం లక్ష్యంగా కంపెనీ చేపట్టిన కార్యక్రమాలు దేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విధంగా, పతంజలి గులాబీ షర్బత్ కేవలం పానీయం మాత్రమే కాదు, ఒక పెద్ద సామాజిక లక్ష్యంలో భాగం" అని పతంజలి తెలిపింది.





















