అన్వేషించండి

India News: సంక్షోభం సమయంలో భారత్‌కు 30 రోజుల మినహాయింపు.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా మినహాయింపు

అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ మీద కొనసాగిస్తున్న యుద్ధం వల్ల చమురు సంక్షోభం ఏర్పడుతోంది. దాంతో 30 రోజులపాటు రష్యా చమురు కొనుగోలుకు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.

వాషింగ్టన్: సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకలను భారతదేశానికి పంపడానికి అమెరికా అనుమతించింది. ఇది కేవలం 30 రోజుల తాత్కాలిక మినహాయింపు మాత్రమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడిని తగ్గిస్తుందని, అలాగే చమురు సంక్షోభంలో భారత్‌కు భారీ ఉపశమనం కలిగిస్తుందని ఇద్దరు సీనియర్ అమెరికా అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.

భారత్ వద్ద 25 నుంచి 40 రోజుల ముడి చమురు నిల్వలు

భారత్‌కు మధ్యప్రాచ్యం నుండి చాలా చమురు వస్తుంది. దేశంలో కేవలం 25 నుంచి 40 రోజుల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నాయి. 40 శాతం చమురు హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఇక్కడ ఏదైనా సమస్య తలెత్తితే భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే అమెరికా భారత్‌కు ఉపశమనం ఇచ్చింది. 'సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురును భారతదేశానికి అమ్మకాలు కొనసాగించడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపును జారీ చేశాం' అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు.

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. అయితే ఈ ఏడాది జనవరి నుండి, చమురు శుద్ధి కర్మాగారాలు తక్కువ కొనుగోలు చేస్తున్నాయి. రష్యాకు చమురు ద్వారా నిధులు అందకూడదని అమెరికా పలు దేశాలపై ఒత్తిడి తెచ్చింది. రష్యా చమురు కొనుగోలు తగ్గింపు అంశంలో భారత్ 25 శాతం టారిఫ్ ప్రమాదాన్ని తప్పించుకుంది. అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కూడా భారత ప్రభుత్వం కుదుర్చుకుంది.

భారత చమురు శుద్ధి కర్మాగారాలు మళ్లీ చురుకుగా మారాయి

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారాల కంపెనీలు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంతో పాటు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, ఇవన్నీ వ్యాపారులతో వీలైనంత త్వరగా రష్యా చమురు పొందడానికి చర్చలు జరుపుతున్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయి.

చమురు పొందాలనుకుంటున్న కంపెనీలు

HPCL, MRPL నవంబర్ తర్వాత మొదటిసారి రష్యా చమురు డెలివరీని తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. వ్యాపారులు ఇప్పుడు మార్చి, ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే రష్యన్ యురల్స్ క్రూడ్‌ను బ్రెంట్ కంటే 4-5 డాలర్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇదే చమురు బ్రెంట్ కంటే 13 డాలర్లు తక్కువకు విక్రయాలు జరిగాయి. 

ఒక బిజినెస్ మ్యాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు భారత చమురు శుద్ధి కర్మాగారాలు ధరను మాత్రమే చూడటం లేదు. వారికి చమురు అణువులు కూడా కావాలి. వాటి లభ్యత అతిపెద్ద సమస్య.' రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వ్యాపారులతో త్వరగా రష్యా ముడి చమురును పొందడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ మినహాయింపు కేవలం చిక్కుకున్న సరకు కోసం మాత్రమే మరియు 30 రోజుల తర్వాత ఏమి జరుగుతుందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ప్రస్తుతానికి భారతదేశంలోని శుద్ధి కర్మాగారాల కంపెనీలకు ఉపశమనం లభించింది మరియు మార్కెట్లో రష్యన్ చమురు రాక పెరుగుతుందని భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul number 16: రాహుల్ చెప్పిన 16 నెంబర్ కథేంటి? టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే కేంద్రం ఉండదని చెప్పాలనుకున్నారా?
రాహుల్ చెప్పిన 16 నెంబర్ కథేంటి? టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే కేంద్రం ఉండదని చెప్పాలనుకున్నారా?
Punjab Zombie drug: పంజాబ్‌లో జోంబీలుగా కనిపిస్తున్న యువత - జోంబీ డ్రగ్ ప్రభావమేనా?
పంజాబ్‌లో జోంబీలుగా కనిపిస్తున్న యువత - జోంబీ డ్రగ్ ప్రభావమేనా?
Rahu Lok Sabha controversy: మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
AKASA SPICEJET Collision:  ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో AKASA AIR SPICE JET ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
 ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
IT Jobs 2026: ఐటీ రంగంలో
ఐటీ రంగంలో "ఏఐ" ప్రకంపనలు! క్యాంపస్ హైరింగ్‌కు కంపెనీలు బ్రేక్‌! 
Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
Rahu Lok Sabha controversy: మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
Sunroof Using Tips: కారుకి సన్‌రూఫ్ ఉందని ఫోజులు కొడితే మూల్యం చెల్లించుకోక తప్పదు! ఈ రూల్స్ గురించి తెలుసుకోండి!
కారుకి సన్‌రూఫ్ ఉందని ఫోజులు కొడితే మూల్యం చెల్లించుకోక తప్పదు! ఈ రూల్స్ గురించి తెలుసుకోండి!
Embed widget