Patanjali Gurukulam: ప్రాచీన విద్యకు ప్రాణం పోస్తున్న పతంజలి- గురుకులాల విస్తరణ
Patanjali Gurukulam:ఆయుర్వేద ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా అందరికీ చేరువైన పతంజలి ఇప్పుడు విద్యారంగంలో కూడా విస్తరిస్తోంది. పేద, నిమ్న వర్గాల పిల్లలకు ఆయుర్వేదం, యోగసాధనను పాఠశాలల ద్వారా అందిస్తోంది.

Patanjali Gurukulam: ఆయుర్వేద రంగంలో దేశంలోనే పెరెన్నిక గల పతంజలి సంస్థ విద్యారంగంలో కూడా తన దైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. యోగా గురు బాబా రాందేవ్, పతంజలి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆ సంస్థ పలు రంగాల్లో మార్కెట్ విస్తరణ చేసింది. ఇప్పుడు విద్యారంగంలో కూడా మార్పులకు ప్రయత్నిస్తోంది. యోగా ద్వారా జనాలకు చేరువైన రాం దేవ్ బాబా పాఠశాల స్థాయిలో యోగసాధన, ఆయుర్వేద అభ్యాసం అవసరం అని సకల్పించారు.
ప్రాచీన గురుకులాల విస్తరణ
ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని ఇప్పటి మోడరన్ యుగంలో అందించే ప్రయత్నం చేస్తోంది పతంజలి. గురుకులాల్లో నేర్పించిన పద్ధతిలోనే యోగ, ఆయుర్వేదం, వంటి వాటిని పతంజలి విద్యాలయాల్లో విద్యార్థులకు నేర్పుతారు. పతంజలి ఆచార్యకులం, గురుకులం, పతంజలి యూనివర్సిటీలో పేద, బడుగు విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నారు.
పతంజలి విద్యాలయాల్లో అకడమిక్ సబ్జెక్టులతో పాటు.. వేదాలు, భారతీయ సంస్కృతిని నేర్పిస్తారు. హరిద్వార్‌లో ఉన్న ఆచార్యకులం CBSEకి అనుసంధానంగా పనిచేస్తుంది. ఇక్కడ బోర్డు పాఠాలతో పాటు.. నైతిక విలువలు, సంస్కృతి పరిరక్షణ , వేదాధ్యయనం వంటివి నేర్పిస్తారు.
దేశవ్యాప్తంగా 500 స్కూల్స్
పతంజలి కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద పేద పిల్లలకు విలువలతో కూడిన అత్యుత్తమ విద్యను అందించాలని నిర్ణయించారు. దీనికోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయనున్నారు. హరిద్వార్‌లోని ఆచార్యకులం తరహాలో దేశవ్యాప్తంగా 500 స్కూల్స్ నిర్మించాలని పతంజలి సంకల్పించింది. దీని ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ కేవలం నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా భావితరాలు సమాజానికి ఉపయోగపడేలా సంపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు.
విద్యారంగంలో పెనుమార్పులు తెస్తాం- రాందేవ్ బాబా
పతంజలి సంస్థను స్థాపించి ౩౦ ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వామి రాందేవ్ బాబా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది పేద పిల్లల భవిష్యత్‌కు మంచి బాట వేస్తుందని ఆయన చెప్పారు.
విలువలతో కూడిన నాణ్యమైన విద్య ద్వారా పేద విద్యార్థుల జీవితాల్లో సానుకూల మర్పులు తీసుకురావచ్చని పతంజలి భావిస్తోంది. మానవీయ విలువలు, సాంప్రదాయ విధానంలో బోధన ద్వారా సామాజిక బాధ్యత గుర్తు చేస్తామని.. తద్వారా సమాజానికి మేలు చేసే విషయంలో విద్యార్థులు బాధ్యతతో ఉంటారని పతంజలి చెబుతోంది,





















