అన్వేషించండి

BC Reservations: బీసీ రిజర్వేషన్లతో తెలంగాణ స్థానిక సంస్దల ఎన్నికల్లో ఏ పార్టీకి మేలు.. ఎవరిని ముంచేస్తాయి ?

Telangana local body elections | బిసి రిజర్వేషన్ ప్రభావం ఎంతవరకూ పనిచేస్తుంది.బిసీ ఓట్లే అజెండగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంటే, బిఆర్ ఎస్,బిజెపిలు ప్రభుత్వ వ్యతిరేకతను టార్గెట్ చేస్తున్నాయి.

BC Reservations in Telangana | హైదరాబాద్: తెలంగాణలో స్దానిక ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు తెరవెనుక కసరత్తులు వేగవంతం చేశాయి. పదునైన వ్యూహాలతో స్థానిక ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు సిద్దమయ్యాయి. అయితే ఈసారి ఎన్నికలు కాస్త వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ప్రజాక్షేత్రంలోకి అధికార కాంగ్రెస్ అడుగుపెడుతోంది. మీరేంతో.. మీకంత.. అంటూ బిసిలను ఐక్యం చేసి, గంపగుత్తగా ఓట్లు సాధించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలోొ బిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం, తరువాత గవర్నర్ గ్రీన్ సిగ్నల్, అక్కడి నుండి రాష్ట్రపతి వద్ద వెయిటింగ్ వరకూ కాంగ్రెస్ పాచిక చేరింది. ఇప్పుడు బంతి రాష్ట్రపతి కోర్టులో ఉంది. ఇలా మాాదేం తప్పులేదు, మేము బిసిలకు చేయాల్సిందంతా చేస్తున్నాం, అడ్డుపడుతున్నది బిజేపినే అంటూ బిసిలకు బిజేపిని దూరం చేసే ప్రయత్నం చేస్తోందనేది పొలిటికల్ టాక్. 

అంతేకాదు బిసిలకు 42శాతం రిజర్వేషన్ల ఆధారంగా స్దానిక ఎన్నిక్లలో సీట్లు కేటాయిస్తూ గెజిట్ కూడా విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో , 565 మండలాల్లో స్దానిక ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త రిజర్వేషన్ల కేటాయింపు తరువాత ఏ కులాలకు తాజాగా సీటు కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..

ఏ సామాజిక వర్గాలకు ఎంత శాతం..

ప్రధానంగా జెడ్పీ చైర్ పర్సన్ తాాజా లెక్కలు పరిశీలిస్తే బీసీలకు 41.93శాతం , ఎస్సీలకు 19.35, ఎస్టీలకు 12.90 , ఓసీలకు 25.80 శాతం సీట్లు కాటాయించింది. జిల్లాల వారీగా రిజర్వేషన్లు చూస్తే ఖమ్మ జిల్లా జడ్పీ చైర్మెన్ ఎస్టీ అభ్యర్దికి, ములుగు జడ్జీ చైర్మెన్  ఎస్టీ మహిళకు కేటాయించారు. నల్గొండ జడ్పీ చైర్ పర్సన్ ఎస్టీ మహిళకు,  వరంగల్ ఎస్టీ, హన్మకొండ , జనగామ జడ్పీలు ఎస్సీ మహిళకు కేటాయించారు. జోగులాంబ గద్వాల్ , రాజన్న సిరిసిల్ల,  రంగారెడ్డి  జిల్లాల జెడ్పీ చైర్ పర్సన్  పదవులు ఎస్సీ మహిళ, సంగారెడ్డి ఎస్సీ కోటా, జయశకంకర్ భూపాలపల్లి, కరీంనగర్ , కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు బిసి అభ్యర్దులకు కేటాయించారు.

నిర్మల్ , నిజామాబాద్ , సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జడ్జీలు బీసిలకు కేటాయించారు.మహబూబ్ నగర్ , మంచిర్యాల , నాగర్ కర్నూల్ , వనపర్తి , యాదాద్రి భువనగిరి జడ్పీలు బీసీ మహిళ ఇచ్చారు. ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట జడ్పీలు ఓసీ మహిళ కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్ , మెదక్ జడ్పీలు ఓసీ జనరల్ కు ఇచ్చారు. ఇలా స్దానిక ఎన్నికల్లో కీలకంగా మారిన జెడ్పీ చైర్ పర్సన్ స్దానాలో మీరెంతో , మీకంత అనే రూల్ ఫాలో అయ్యింది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం.

ఓటు బ్యాంకును తేల్చనున్న స్థానిక ఎన్నికలు

రాబోతున్న స్దానిక సంస్దల ఎన్నికలే తెలంగాణలో అన్ని పార్టీలకు ఆయువుపట్టులాంటివి. స్దానికంగా బలమైన కేేడర్ ను ఏర్పాటు చేసుకోవడంతోపాటు , సర్పంచ్ లు,  ఎంపీటీసిలు, జేడ్ పీటీసీలలో ఎక్కువ సీట్లు దక్కించుకోవడం ద్వారా  ఓటు బ్యాంక్ ను మరింత బలొోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికలే సరైన అవకాశం. ఈ ఎన్నికల్లో గెలుపు లెక్కల ఆధారంగానే మరో మూడేళ్ల తరువాత అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. స్దానిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్దులే ఆయా పార్టీలు అధికారం చేపట్టడంలో క్షేత్ర స్దాయిలో కీలకంగా వ్యవహరిస్తారు. 

స్దానిక సంస్దల ఎన్నికలే తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ పాలకు కొలమానంగా ఆ పార్టీ భావిస్తోంది. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తుందనే నమ్మకం కల్పించామనే ధీమాతో ఉంది. గత పదేళ్లు అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ కు క్యాడర్ దూరమైయయింది. కేవలం కాంగ్రెస్ విధేయులు మాత్రమే పార్టీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కవ మంది ప్రజాప్రనిధులు కాంగ్రెస్ నుండి గెలిస్తే వారితో వచ్చే క్యాడర్ పార్టీకి బలంగా మారుతుందని అంచానా వేస్తోంది.అందులోనూ 42శాతం బిసి రిజర్వేషన్ సానుకూలంగా ప్రభావం చూపుతుందని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ చిత్తశుద్ది చూపించిందనే నమ్మకం జనాల్లోకి వెళ్లిందని,  బీసీలంతా తమకే ఓటేస్తారనే బిసి మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం కూడా అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్ వంటి అంశాలపై కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఇవన్నీ స్దానిక ఓటర్లపై ప్రభావం చూపే అంశాలు. ఈ ఎన్నికల్లో సత్తా చాటి ప్రతిపక్షాలకు గట్టి బదులివ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ

బీఆర్ఎస్ కూడా తామేం తక్కువ తినలేదంటూ స్దానిక పోరుకు సిద్దంగా ఉంది. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాల సాధిస్తే క్యాడర్ లో కొత్త జోష్ వస్తుందని నమ్ముతోంది. కాంగ్రెస్ సర్కార్ పై వ్యతిరేకత వచ్చిందనేది నిరూపించే ఎన్నికలు ఇవేనని గులాబీ నేతలు భావిస్తున్నారు. గల్లీ ఎన్నికలైనా.. ఢిల్లీ ఎన్నికలైనా కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారనేది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. బిజెపి కూడా క్షేత్రస్దాయిలో తమ బలాన్ని పరిక్షించుకోవడానికి, లోకల్ గా పార్టీకి చికిత్స చేయడానికి స్దానిక ఎన్నికలే సరైన వేదికగా భావిస్తోంది. పార్టీలో సమన్వయ లోపంతో మంచిఫలితాలు రావడంలేదని భావనలో ఉంది. ఆ లోపాలను స్దానికంగా సరిచేసుకోవాలని, ప్రత్యర్దులకు గట్టి సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. 8 ఎంపీలు గెలిచిన మాకు 35శాతం ఓటు బ్యాక్ ఉంది. రూరల్ సైడ్ మా బలం పెరిగింది. స్దానిక పోరులో బిజేపి నంబర్ వన్ లో ఉంటుందని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాాగా మారిన బీసీ లెక్కల ప్రకారం బీసీలు ఏ పార్టీవైపు ఉంటారనేదాన్నిబట్టే, ఆయా పార్టీల గెలుపు లెక్కలు ఆధారపడి ఉంటాయని రాజకీయనిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget