Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Telangana Sarpanch Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.

MPTC and ZPTC Elections In Telangana | హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. పంచాయతీరాజ్‌శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు లేకుండా విస్తృతస్థాయిలో చర్చించిన తరువాత సోమవారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 31 జిల్లాలు, 565 మండలాలలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 5749 ఎంపీటీసీ, 565 జడ్పీజీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీలకు 15302 , 31 వేల 377 పోలింగ్ బూత్ లు ఏర్పాటు, 12733 గ్రామ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు.
అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్
రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే విధంగా మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అదేరోజు నామినేషన్లు ప్రారంభం అవుతాయని ఈసీ తెలిపారు. మొత్తం 5 ఫేజ్ లుగా ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 23న ఎన్నికలు, రెండో ఫేజ్ 27న ఎన్నికలు నిర్వహించనున్నారు.

3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీలకు ఫేజ్ 1 అక్టోబర్ 17న నామినేషన్లు ప్రారంభం కాగా, ఎన్నికలు అక్టోబర్ 31న జరగనున్నాయి. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. రెండో ఫేజ్ 21న నామినేషన్లు ప్రారంభం కాగా, నవంబర్ 4న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మూడో ఫేజ్ అక్టోబర్ 25న నామినేషన్లు మొదలుకాగా, నవంబర్ 8న ఎన్నికలు నిర్వహించి, ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. నవంబర్ 11న ఎన్నికల ప్రక్రియ ముగియనుందని ఈసీ తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ - ఫేజ్ 1
అక్టోబర్ 9 - ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 9 - అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం
అక్టోబర్ 11 - నామినేషన్ల దాఖలు తుది గడువు
అక్టోబర్ 12 - నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 15 - నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు
అక్టోబర్ 23 - ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు తొలివిడత ఎన్నికలు
నవంబర్ 11 - ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ - ఫేజ్ 2
అక్టోబర్ 13 - ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 13 - అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం
అక్టోబర్ 15 - నామినేషన్ల దాఖలు తుది గడువు
అక్టోబర్ 16 - నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 19 - నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు
అక్టోబర్ 27 - ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెండో విడత ఎన్నికలు
నవంబర్ 11 - ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన
గ్రామ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ - ఫేజ్ 1
అక్టోబర్ 17 - గ్రామ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 17 - అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం
అక్టోబర్ 19 - నామినేషన్ల దాఖలు తుది గడువు
అక్టోబర్ 20 - నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 23 - నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు
అక్టోబర్ 23 - సర్పంచ్ స్థానాలకు అభ్యర్థుల జాబితా
అక్టోబర్ 31 - ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన
గ్రామ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ - ఫేజ్ 2
అక్టోబర్ 21 - గ్రామ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 21 - అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం
అక్టోబర్ 23 - నామినేషన్ల దాఖలు తుది గడువు
అక్టోబర్ 24 - నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 27 - నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు
అక్టోబర్ 27 - సర్పంచ్ ఎన్నికలు రెండో విడత అభ్యర్థుల జాబితా
నవంబర్ 4 - ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన
గ్రామ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ - ఫేజ్ 3
అక్టోబర్ 25 - గ్రామ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 25 - అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం
అక్టోబర్ 27 - నామినేషన్ల దాఖలు తుది గడువు
అక్టోబర్ 28 - నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 31 - నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు
అక్టోబర్ 31 - సర్పంచ్ ఎన్నికలు మూడో విడత అభ్యర్థుల జాబితా
నవంబర్ 8 - ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన






















