India vs West Indies Test Match | తడబడ్డ విండీస్ ఓపెనర్లు
ఇండియా వెస్ట్ ఇండీస్ మధ్య తోలి టెస్ట్ మ్యాచ్ మొదలయింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ... తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఓపెనర్లు తడబడ్డారు. ఒకరి తర్వాత మరొకరు.. ఇలా వరుసగా అందరు పెవిలియన్ చేరారు. ఈ సిరీస్‌లో వెస్టిండీస్ కొత్త ఓపెనింగ్ ప్లేయర్స్ ను బరిలోకి దింపింది. కానీ బుమ్రా-సిరాజ్‌ల బౌలింగ్ కు టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
కొత్త ఓపెనింగ్ ప్లేయర్స్ తేజ్‌నారాయణ్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్ లు వచ్చారు. ఈ భాగస్వామ్యం 12 పరుగులకే బ్రేక్ అయింది. సిరాజ్, తేజ్‌నారాయణ్ చంద్రపాల్ వికెట్ తీసాడు. బుమ్రా 20 పరుగుల వద్ద మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్‌ను అవుట్ చేశాడు. ఓపెనర్లను అవుట్ అయిన తర్వాత బుమ్రా-సిరాజ్ జోడీ చెలరేగారు. సిరాజ్ తన బౌలింగ్ లో మరింత దూకుడు చూపించాడు. బ్రెండన్ కింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసి, ఆ తర్వాత అథనేజ్ ను కూడా అవుట్ చేసాడు. కేవలం 42 పరుగులకే నలుగురు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరారు. చివర్లో సిరాజ్ ఫైవ్ వికెట్ హాల్ కోసం ప్రయత్నించినా లక్కు కలిసి రాలేదు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు రెండు, వాషింగ్టన్ సుందర్ కి ఒక వికెట్ దక్కింది. తోలి ఇనింగ్స్ లో భారత బౌలర్ల డామినేషన్ కనిపించింది.





















