(Source: ECI | ABP NEWS)
Ind Vs Wi Ravindra Jadeja Latest Record: టెస్టుల్లో జడేజా అరుదైన ఘనత.. లెజెండరీ కెప్టెన్ ధోనీ సరసన చేరిక.. లిస్టులో టాప్ లో పంత్, సెహ్వాగ్, రోహిత్
ఆల్ రౌండర్ గా అటు బంతి, ఇటు బ్యాట్ తో సత్తా చాటుతున్న జడేజా, తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మాజీ కెప్టెన్ ధోనీ సరసన నిలిచాడు. టవరింగ్ సిక్సర్లతో ఈ ఘనత సాధించాడు.

Ravindra Jadeja Scored Cetntury VS Wi in 1st Test : భారత సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. టెస్టుల్లో లెజేండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో ధోనీ సరసన జడ్డూ చేరాడు. తాజాగా అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో 5 సిక్సర్లు కొట్టిన జడేజా.. తన కెరీర్లో 78వ సిక్సర్ ను సాధించాడు. దీంతో ధోనీ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్ లో జడేజా అజేయ సెంచరీ (176 బంతుల్లో 104 బ్యాటింగ్, 6 ఫోర్లు, 5 సిక్సర్లు)తో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక క్లాసిక్ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరిద్దరూ కెరీర్లో 90 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచారు. వారి తర్వాత స్థానంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 88 సిక్సర్లతో నిలిచాడు.
Stand up and applaud 👏👏
— BCCI (@BCCI) October 3, 2025
Ravindra Jadeja's celebration says it all 💯
Scorecard ▶️ https://t.co/MNXdZceTab#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/PCxiPwf1QS
అగ్రెసివ్ బ్యాటర్..
ఇక తొలి స్థానంలో ఉన్న పంత్ గురించి తెలిసిందే. పరిస్థితులు ఎలా ఉన్న తనదైన శైలిలో ధనాధన్ ఆటతీరుతో అభిమానులను అలరిస్తాడు. కేవలం 27వ పడిలోనే , ఆడిన 47 టెస్టుల్లోనే పంత్ ఈ ఘనత సాధించాడు. మరో మ్యాచ్ ఆడితే తనే అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ క్రికెటర్ గా రికార్డు సాధించడంతోపాటు వంద సిక్సర్ల మార్కును కూడా అతి త్వరలో చేరుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫార్మాట్ ఏదైనా కానీ, సిక్సర్లను మంచి నీళ్లు తాగినట్లుగా బాదడం సెహ్వాగ్ శైలి.. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ ఇలా మైలురాయిని సమీపించినప్పుడు కూడా సిక్సర్లు బాది, ఆ మార్కును చేరుకున్న అరుదైన ఆటగాడు సెహ్వాగ్.
భారీ విజయంపై కన్ను..
విండీస్, భారత్ మధ్య తొలి టెస్టు ఏకపక్షంగా సాగుతోంది. బ్యాటర్లు సెంచరీలతో పండుగా చేసుకోవడంతో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆటముగిసేసరికి 128 ఓవర్లలో 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (197 బంతుల్లో 100, 12 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (210 బంతుల్లో 125, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలు సాధించారు. ప్రస్తుతం జడేజాతో కలసి వాషింగ్టన్ సుందర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓవరాల్ గా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ రోజు మొత్తం మీద సెషన్ కు ఒక వికెట్ చొప్పున కేవలం మూడు వికెట్లను మాత్రమే భారత్ కోల్పోవడం విశేషం. అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మ్యాచ్ ను మూడోరోజే ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. శనివారం వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి, త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని భావిస్తోంది.




















