Siraj Record India vs West Indies Test Match | మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డ్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో మొదటి రోజే సిరాజ్ ఒక పెద్ద రికార్డును తన పేరిట రాసుకున్నాడు. మొదటి సెషన్‌లో 3 వికెట్లును పడగొట్టిన సిరాజ్... నాలుగవ సెషన్‌లో మొదటి వికెట్ కూడా అతనే తీసుకున్నాడు. దాంతో మిచెల్ స్టార్క్‌ను అధిగమించి .. ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న టీమ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ రెండవ స్థానానికి చేరుకున్నాడు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొందరగా టాప్ ఆర్డర్ వికెట్లను సమర్పించుకుంది. ఓపెనర్ తేజ్‌నారాయణ్ చంద్రపాల్ వికెట్ ను సిరాజ్ చాలా తొందరగా పడగొట్టాడు. కొద్దీ సేపటికే బ్రెండన్ కింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసాడు. ఆ తర్వాత అథనేజ్ ను కూడా అవుట్ చేసాడు. రెండో సెషన్‌లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సిరాజ్ ఐసీసీ డబ్ల్యూటీసీ ఆడుతున్న టీంస్ లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 30 వికెట్లను తీసాడు సిరాజ్. స్టార్క్ 29 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.





















