BCCI vs Mohsin Naqvi | Asia Cup 2025 | ఆసియాకప్పు పై కీలక నిర్ణయం
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించిన ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిశాక కప్పుతో పాటు విన్నర్ మెడళ్లను టీమిండియాకు అప్పగించకుండా ACC చీఫ్ మోసిన్ ఖ్వి తనతోపాటే తీసుకెళ్లాడు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతోపాటు ఏసీసీ చీఫ్ గా నఖ్విను ఆ పొజిషన్ నుంచి తీసేస్తామని రెసల్యూషన్ తీసుకొస్తామని చెప్పడంతో నఖ్వి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. కప్పు, మెడళ్లను టోర్నీ యూఏఈకి అప్పగించి, తను సొంతదేశం పాక్ కు వెళ్లుతున్నట్లుగా తెలుస్తుంది.
నఖ్వి వ్యవహార శైలిపై ఇప్పటికే బీసీసీఐ ... ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వచ్చేనెలలో జరిగే సమావేశంలో ఈ విషయాన్ని తేల్చుకోవాలని బోర్డు పట్టుదలగా ఉంది. మరోవైపు త్వరలోనే యూఏఈ బోర్డు నుంచి కప్పుతోపాటు మెడళ్లను బీసీసీఐ సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ లు ఉద్రిక్తంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడుసార్లు జరిగిన ఈ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలిచి హ్యాట్రిక్ సాధించడంతోపాటు... కప్పును సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఇది ఇండియాకు తొమ్మిదో ఆసియాకప్పు టైటిల్ కావడం విశేషం.




















