Avatar 2 Re Release: 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' - 'అవతార్ 2' రీ రిలీజ్‌తోనే మరో అద్భుతం... థియేటర్లలో డోంట్ మిస్
James Cameron: 'అవతార్ 2' రీ రిలీజ్‌తో పాటే హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'అవతార్ 3'కి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను ఇందులో యాడ్ చేశారు.

Hollywood Director James Cameron Message To Audiences While Avatar 2 Re Release: 'అవతార్'... ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది సిల్వర్ స్క్రీన్‌పై ఓ విజువల్ వండర్. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 2 పార్టులు 'అవతార్' (2009), 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' (2022) ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'అవతార్ : పైర్ అండ్ యాష్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అవతార్ 2' రీ రిలీజ్... బిగ్ సర్‌ప్రైజ్
'అవతార్ 3' రిలీజ్‌కు ముందు గురువారం నుంచి 'అవతార్ 2'ను రీ రిలీజ్ చేసింది మూవీ టీం. 3D ఫార్మాట్‌లో మూవీ అందుబాటులోకి రానుండగా... దాదాపు వారం రోజుల పాటు ఈ మూవీ థియేటర్లలో ఉండనుంది. పాండోరా అద్భుతమైన అండర్ వాటర్ వరల్డ్, సల్లీ ఫ్యామిలీ హార్ట్ టచింగ్ స్టోరీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ప్రస్తుతం ఆడియన్స్‌కు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ఈ క్రమంలో ఆడియన్స్‌కు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు జేమ్స్ కామెరూన్. 'అవతార్ 2' ప్రారంభానికి ముందు కామెరూన్ స్పెషల్ వీడియో మెసేజ్ కూడా ప్రదర్శించారు. ఇందులో రాబోయే 'అవతార్: ఫైర్ అండ్ యాష్'కు సంబంధించి బిహైండ్ ది సీన్స్, బ్యూటిఫుల్ లుక్స్ చూపించారు. ఇందులో సల్లీ ఫ్యామిలీ సహా స్పైడర్‌తో కలిసి వింట్ ట్రేడర్స్‌కు చెందిన బిగ్ జెల్లీ ఫిష్ ప్రయాణిస్తున్న సీన్‌తో స్టార్ట్ అవుతుంది. వీరితో పాటు ఓ కొత్త పాత్రను కూడా వీడియోలో ఇంట్రడ్యూస్ చేశారు. 'అవతార్' ఫ్రాంచైజీలో ఫస్ట్ టైం ఈ పాత్ర కనిపించనుండగా... కొత్త సీక్వెన్స్‌లో జేక్ సల్లీ, విండ్ ట్రేడర్స్‌తో కొత్త మిత్రులు చేరినట్లు కన్ఫర్మ్ అయ్యింది.
ఈ వీడియోను బట్టి రాబోయే 'అవతార్: ఫైర్ అండ్ యాష్' మూవీలో అద్భుతమైన విజువల్స్, పాండోరా ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి తెర లేపినట్లు అర్థమవుతోంది. 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్'ను ఎంజాయ్ చేస్తూనే రాబోయే కొత్త ప్రపంచం ఫస్ట్ లుక్ ఎంజాయ్ చేయాలంటూ మేకర్స్ చెబుతున్నారు.
Also Read: ఓటీటీలోకి పవన్ 'OG' వచ్చేది ఎప్పుడో తెలుసా? - ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇవ్వనున్న మూవీ టీం
ట్రైలర్స్ అదుర్స్
'అవతార్ : ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు కామెరూన్. ఇక మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్ని కాన్సెప్ట్‌తో రూపొందించారు. మొదటి రెండు పార్టులు భూమి, నీరుకు సంబంధించినవి. ఇక ఈ ఫ్రాంచైజీలో పంచభూతాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.
భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ (సామ్ వర్తింగ్టన్) అక్కడ ఓ తెగకు చెందిన నేతిరిని వివాహం చేసుకుంటాడు. భూమి అంతం అవుతుందని గ్రహించిన మనుషులు పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవాలని చూడగా... జేక్ ఫ్యామిలీతో సహా సముద్ర ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడి రాజు సహకారంతో శత్రువులపై పోరాటాన్ని 'అవతార్ 2'లో చూపించగా... దీనికి సీక్వెల్‌లో అగ్ని ప్రధానాంశంగా చూపించనున్నారు.





















