Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sri Lanka: దిత్వా తుఫాన్ దెబ్బకు శ్రీలంక దెబ్బతిన్నది. పాకిస్తాన్ ఆ దేశానికి సాయం పంపింది. అవేమిటంటే గడువు తీరిన ఫుడ్ ప్యాకెట్లు.

Pakistan expired food packages to Sri Lanka : శ్రీలంకలో జరిగిన వరదల సమయంలో సహాయం చేస్తామని పాకిస్తాన్ పంపిన ఆహార ప్యాకెట్లు ‘పాస్ట్’ అయ్యాయని తేలడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వర్షం కురుస్తున్నాయి. సైక్లోన్ దిట్వా (Cyclone Ditwah) వల్ల శ్రీలంకలో వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనల వల్ల 410 మంది మరణించారు. ఈ సంక్షోభంలో సానుభూతి చూపించామని.. ఆహారపు ప్యాకెట్లు సరఫరా చేశామని పాకిస్తాన్ హైకమిషన్ కొలంబోలో పోస్ట్ చేసిన ఫుడ్ ప్యాకెట్ల ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ, ప్యాకెట్లపై ‘10/2024’ అనే ఎక్స్‌పైరీ డేట్ కనిపించడంతో నెటిజన్లు పాకిస్తాన్ ను ఓ ఆట ఆడుకున్నారు. 
ప్యాకెట్లలో బియ్యం వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ, ఫోటోల్లో కనిపించిన ప్యాకెట్లపై ‘ఎక్స్‌పైరీ డేట్: 10/2024’ అని స్పష్టంగా రాసి ఉంది. ఇప్పుడు 2025 డిసెంబర్‌లో ఇవి పూర్తిగా పాస్ట్ అయ్యాయి. నెటిజన్లు దీన్ని చూసి షాక్ అయ్యారు. గార్బేజ్‌లో పారవేయడం కంటే, పాకిస్తాన్ తన ఎక్స్‌పైర్డ్ ఫుడ్ మెటీరియల్‌ను వరద బాధిత శ్రీలంకకు పంపడాన్ని ఎంచుకుందని విమర్శలు ప్రారభించారు.
🔥🇵🇰 EXCLUSIVE: Pakistan sent expired food as flood relief to Sri Lanka 😡 Aid turns into outrage! 🇱🇰⚠️
— Wahida 🇦🇫 (@RealWahidaAFG) December 2, 2025
Pak Army sent expired food products as food aid to Sri Lankan Buddhists in hopes of food poisoning. Last time, they sent beef spice mix packets to Nepali Hindus to insult them.… pic.twitter.com/HVMOA9RGmE
విమర్శలు తీవ్రమైన తర్వాత, పాకిస్తాన్ నేవీ క్లారిఫికేషన్ ఇచ్చింది. అత్యవసరంగా బ్యాగులు కావాలని, షిప్‌పై బ్యాక్‌లాగ్‌లో ఉన్న పాత బ్యాగులను ఉపయోగించారని కవర్ చేసుకుంది. మేము శ్రీలంక పౌరులకు సహాయం చేయడానికి కమిటెడ్‌గా ఉన్నామని బ్యాగులు పాతవి కానీ, లోపలి ఆహారపదార్ధాలు ఫ్రెష్ అని వాదించారు.
Beggars🤡 sending expired stuff as aid 🤣🤣
— देशभक्त (@desh_bhakt7) December 2, 2025
Zoom in to see the dates
Manufactured : 10/2022 (printed on bottom left corner of packet)
Expired : 10/2024 (printed on bottom right corner of packet) pic.twitter.com/LVvRe0Rqqw
అంతేకాకుండా, మంగళవారం డిసెంబర్ 2న పాకిస్తాన్ హైకామిషన్ కొత్త పోస్ట్ చేసింది. పాకిస్తాన్ వరద బాధితులకు రేషన్ బ్యాగులను కొలంబోలోని గంగారామ టెంపుల్ ద్వారా డొనేట్ చేసిందని హైకామిషనర్ మేజర్ జనరల్ ఫహీమ్ ఉల్ అజీజ్ టెంపుల్‌ను సందర్శించి, సహాయం పంపారని చెప్పుకున్నారు.
Shameful. This is verified. Expired food packets, that too just a small number, was sent by Pakistan to Sri Lanka as "relief" with big advertisements on the package "Pakistan stands with Sri Lanka now and always."
— Aravind (@aravind) December 2, 2025
Now that they are caught, they will use their social media… https://t.co/RgtT5s01NX





















