HIV to AIDS Stages : HIV నుంచి AIDS స్టేజ్ బై స్టేజ్ లక్షణాలు, ప్రమాదాలు ఇవే.. చికిత్స ఎందుకు అవసరమంటే
HIV Progresses Step-by-Step : హెచ్ఐవి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. అది మూడు దశల్లో పెరుగుతుంది. ప్రతి దశలో లక్షణాలు, ప్రమాదాలు వేర్వేరుగా ఉంటాయి. అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

HIV Phases & Risks : ఎవరికైనా హెచ్ఐవీ వైరస్ సోకితే కచ్చితంగా చికిత్స చేయించుకోవాలి. ఎయిడ్స్కి నివారణ లేకపోవచ్చు కానీ.. సమస్యను కంట్రోల్ చేయగలిగే చికిత్సలు చాలావరకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ చికిత్స చేయించుకోకపోతే.. హెచ్ఐవీ వైరస్ మూడు దశల్లో పెరగడం మొదలవుతుంది. ఒక్కో స్టేజ్లో లక్షణాలు మారుతాయి. దానిఫలితాలు వేరుగా ఉంటాయి. అందుకే ఎవరికైనా HIV సోకిందని అనిపిస్తే.. వెంటనే వైద్యులని సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే హెచ్ఐవీకి చికిత్స తీసుకోవడం ప్రారంభిస్తే దాని ఎక్స్పోజర్, సంక్రమణం పెంచడం నుంచి ఆపుతుందని చెప్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వారు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ని సేవించవచ్చు. దీనివల్ల వైరస్ శరీరంలో పెరగడం ఆగిపోతుంది. లేదంటే HIV స్టేజ్ బై స్టేజ్ పెరిగిపోతుంది. వైరస్ ఎలా అభివృద్ధి చెందుతుందో.. దాని లక్షణాలు ఏంటో చూసేద్దాం.
స్టేజ్ 1 - తీవ్రమైన HIV సంక్రమణ
HIV వైరస్ సోకిన వ్యక్తితో సంపర్కం ఉన్న తరువాత.. ఈ వైరస్ చాలా వేగంగా పెరగడం మొదలవుతుంది. రక్తంలో ఇది పెరుగుతుంది. ఈ సమయంలో ఈ వైరస్ చాల ప్రమాదకరంగా మారుతుంది. సులభంగా మరో వ్యక్తికి చేరిపోతుంది. ఈ సంక్రమణం రక్తం, వీర్యం, మల ద్రవం, యోనిద్ర ద్రవ్యం, తల్లి పాల ద్వార వ్యాపించవచ్చు. వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల మధ్యలో చాలా మందికి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. అవి కొన్ని రోజులు లేదా వారల వరకు ఉంటాయి. అయినా ప్రతి వ్యక్తిలో లక్షణాలు కనిపించవు.
స్టేజ్ 2 - క్రోనిక్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్
మొదటి దశ తర్వాత చికిత్స చేయకపోతే.. హెచ్ఐవీ వైరస్ శరీరంలో ధీమాగా పెరిగిపోతుంది. ఇదీ అసింప్టోమాటిక్ స్టేజ్. లేదా క్లినికల్ లేటెన్సీ అంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఏమి లక్షణాలు కనిపించవు. చాలా తక్కువ లక్షణాలు ఉంటాయి. ఈ స్టేజ్లో కూడ వైరస్ మరో వ్యక్తికి వ్యాపించవచ్చు. చికిత్స లేకుండా ఈ దశలో ఈ ఇన్ఫెక్షన్ 10 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ సమయం కూడా ఉండవచ్చు. కానీ రోగి చికిత్స లో యాంటీరెట్రోవైరల్ థెరపీ తీసుకుంటే.. వైరస్ పెరగడం ఆపవచ్చు. దీనివల్ల శరీరంలో వైరస్ లోడ్, వ్యాపించడం తక్కువ అవుతుంది. వైరల్ లోడ్ ఎంత తక్కువ అది అంత వేగంగా వ్యాపిస్తుంది. దీనిని U and U అంటారు. అంటే Undetectable-Untransmittable.
స్టేజ్ 3 - ఎయిడ్స్
HIVలో చివరి దశను ఎయిడ్స్ అంటారు. ఇదే మూడో దశ. ఈ స్టేజ్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ చాలా వీక్ అయిపోతుంది. చిన్న వ్యాధులతో, సీజనల్ డీసిజ్తో కూడా శరీరం పోరాడలేకపోతుంది. ఇలాంటి పరిస్థితిలో చికిత్స తీసుకోకపోతే.. వైరస్ లోడ్ పెరుగుతోంది. cd4 కణాలు సంఖ్య 200 కంటే తగ్గిపోతాయి. ఈ దశలో అంటువ్యాధులు ఎక్కువ అవుతాయి. దీనివల్ల నిరంతరం జ్వరం రావడం, రాత్రి వేళలో చెమటలు, బరువు తగ్గడం, నిరంతరం దగ్గు, చర్మం లేదా నోటిపై పొక్కులు రావడం వంటివి కనిపిస్తాయి. ఇది చివరికి మరణానికి దారి తీస్తుంది.
కాబట్టి వైరస్ సోకిందని అనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. కచ్చితంగా రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకోవాలి. దీనివల్ల శరీరంలో వైరస్ పెరుగుదల తగ్గుతుంది. వ్యాప్తి కూడా కట్టడిలో ఉంటుందని చెప్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















