అన్వేషించండి

Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే

Money Rules You Must Follow in 2026 : కొత్త ఏడాదిలో డబ్బులను సేవ్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఏ తప్పులు చేస్తే ఆర్థిక భద్రత లోపిస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

Financial Reset in 2026 : రాబోయే సంవత్సరాల్లో అయినా ఆర్థికంగా సేఫ్టీగా ఉండాలంటే.. ఈ కొత్త ఏడాది 2026లో డబ్బులు విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు. పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, స్టాక్స్​లోకి వెళ్లేప్పుడు, ఎమర్జెన్సీ ఫండ్​పై అవగాహన కలిగి ఉండాలి. డబ్బులను పొదుపు చేయడం కోసం, దీర్ఘకాలిక పెట్టుబడితో లాభాలు తీసుకోవాలనుకుంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డబ్బు విషయంలో వచ్చే ఏడాది అస్సలు చేయకూడని అంశాలపై దృష్టి పెట్టాలి. 

పొదుపు తగ్గించేశారట

భారతదేశం ఒకప్పుడు బలమైన పొదుపు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. కానీ ఇటీవలి డేటా ఆందోళనకరమైన చిత్రాన్ని చూపుతోంది. బిజినెస్ టుడే, ది ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం.. ఈరోజు సంపాదించిన ప్రతి 100 రూపాయలకి కేవలం 5 మాత్రమే పొదుపు చేస్తున్నాయంటూ షాకింగ్ విషయాన్ని తెలిపాయి. ఇది దశాబ్దాలలోనే అత్యల్పం. వినియోగం, జీవనశైలి ఎంపికలకు నిధులు సమకూర్చడానికి అప్పులు గణనీయంగా పెరిగాయట.

జీవన వ్యయం పెరగడం, క్రెడిట్‌కు సులభమైన మార్గాలు ఉండడం, మారుతున్న వినియోగ ఆకాంక్షలు, ముఖ్యంగా యువ సంపాదకులలో ఈ మార్పును ప్రతిబింబిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఫలితంగా పొదుపు ఇక నిష్క్రియంగా లేదా మిగిలిపోయిన ఆదాయంగా ఉండదు. ఇది ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తుందని.. దానిని దూరం చేసుకోవడానికి మంచి ప్రణాళిక అవసరమని చెప్తున్నారు.

పెంపొందించుకోవాల్సిన రెండు అలవాట్లు..

  • వచ్చే జీతంలో లేదా ఆదాయంలో సేవింగ్స్ అనేవి తప్పనిసరి నెలవారీ ఖర్చుగా పరిగణించాలి.
  • జీతం జమ అయిన రోజునే పొదుపు లేదా పెట్టుబడి ఖాతాలకు బదిలీలను ఆటోమేట్ చేయాలి.

మానుకోవాల్సిన అలవాట్లు

  • చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే.. ముందు ఖర్చు చేసి.. మిగిలింది పొదుపు చేస్తారు.
  • దీర్ఘకాలిక పొదుపును తగ్గించేసి.. చిన్న, రోజువారీ ఖర్చులను విస్మరిస్తారు. ఈ అలవాట్లు మానుకోవాలి.

దీర్ఘకాలిక పెట్టుబడి ముఖ్యం.. ట్రెండ్స్ కాదు

గత దశాబ్దంలో భారతీయ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ గురించి మరింత అవగాహన పెంచుకున్నారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఆశించే గృహాలతో, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ SIPల ద్వారా ఈక్విటీ భాగస్వామ్యంలో స్థిరమైన పెరుగుదలను పొందుతున్నారు. అయితే నిపుణులు దీనిపై కొన్ని సూచనలు చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్​ కోసం ఉపయోగించాలంటున్నారు. మార్కెట్​లో మార్పులు, సోషల్ మీడియా స్టాక్ టిప్స్, డబ్బు కోల్పోతామనే భయంతో చాలా మంది పెట్టుబడిదారులను ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వారికి నష్టం ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ ఫండమెంటల్స్ తెలుసుకుని.. దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మంచిదని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.

స్టాక్ మార్కెట్​లో ఫాలో అవ్వాల్సిన టిప్స్..

పదవీ విరమణ, గృహ యాజమాన్యం లేదా పిల్లల విద్య వంటి జీవిత లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక SIPలు ప్లాన్ చేసుకోవాలి. పెట్టుబడులను కేంద్రీకరించడం కంటే ఆస్తి తరగతులలో మంచి పోర్ట్‌ఫోలియోలను బిల్డ్ చేసుకోవాలంటున్నారు.

స్టాక్ మార్కెట్​లో ఈ తప్పులు చేయకండి

త్వరిత లాభాల కోసం మార్కెట్ వెంటపడటం లేదా మార్కెట్ ఫ్లో ఆధారంగా పెట్టుబడులను మార్చడం చేయకూడదు. మార్కెట్ దిద్దుబాట్ల సమయంలో పెట్టుబడులను ముందుగానే రీడీమ్ చేయడం మంచిది కాదు.

ఎమర్జెన్సీ ఫండ్

ఆర్థిక పోర్టల్‌లు ప్రచురించిన వ్యక్తిగత ఆర్థిక చెక్‌లిస్ట్‌లు ఎమర్జెన్సీ ఫండ్ ఆర్థిక స్థిరత్వానికి వెన్నెముక అని నొక్కి చెబుతున్నాయి. దీనిలో భాగంగా అందుబాటులో ఉండే సాధనాలలో (ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్) మూడు నుంచి ఆరు నెలల వరకు అవసరమైన ఖర్చులను పక్కన పెట్టాలి. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వినియోగం, వ్యక్తిగత రుణాలు తగ్గించాలి. లేదంటే అవి ఫ్యూచర్​లో రెడ్ ఫ్లాగ్స్​గా మారుతాయి. అప్పులు పెరిగి.. సంవత్సరాల తరబడి చేసిన పొదుపు హుష్ కాక్​ అవుతుంది.

చేయకూడని తప్పులు

పెట్టుబడి పెట్టడానికి ముందు అత్యవసర నిధిని క్రియేట్ చేసుకోవాలి. ముందు వాటిని పక్కన పెట్టుకున్న తర్వాతే పెట్టుబడి స్టార్ట్ చేయాలి. క్రెడిట్‌ తీసుకుంటే అధిక-వడ్డీల బారిన పడకుండా తిరిగి చెల్లించాలి. క్రెడిట్ కార్డులను ఆదాయానికి పొడిగింపుగా భావించకూడదు. అంటే మీకు వచ్చే శాలరీతోపాటు క్రెడిట్ లిమిట్ ఇంత ఉంది అనుకుంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అలాగే సరైన చెల్లింపు ప్రణాళిక లేకుండా లోన్స్ తీసుకోకూడదు. 

సరైన ప్రణాళికతో రీసెట్‌

కొన్ని వారాల్లోనే మసకబారే మనీ సేవింగ్స్​కు బదులుగా.. ఒక నిర్మాణాత్మక సమీక్షను సిఫార్సు చేస్తున్నారు నిపుణులు. ఆర్థిక సలహాదారులు ప్రతి సంవత్సరం ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, బీమా కవర్, పన్ను ప్రణాళికను సమీక్షించడానికి కనీసం ఒక కేంద్రీకృత సెషన్‌ను కేటాయించాలని సూచిస్తున్నారు. ప్రతి జనవరిలో వ్యక్తిగతంగా మీరు గత సంవత్సరం చేసిన మిస్టేక్స్ ఏంటి? ఈ ఏడాది ప్రధానంగా వచ్చే ఖర్చులు ఏంటి? ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై క్లారిటీ తెచ్చుకోవాలి. వాటికి అనుగుణంగా పొదుపు లక్ష్యాలను సర్దుబాటు చేసుకోవాలి.

2026లో అవసరమైన మార్పు

భారతదేశంలో ఆర్థిక శ్రేయస్సు తదుపరి దశ కేవలం ఆదాయ వృద్ధి ద్వారా కాకుండా.. క్రమశిక్షణతో కూడిన డబ్బు ప్రవర్తన ద్వారా నడుస్తుందని గుర్తించుకోవాలి. ద్రవ్యోల్బణం, ఎక్కువ జీవితకాలం, మారుతున్న ఉద్యోగాల్లో భాగంగా స్వల్పకాలిక సౌకర్యం కంటే దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి సారించాలి. చిన్న, స్థిరమైన అలవాట్లతో మనీ బిల్డ్ చేసుకోవాలంటున్నారు. క్రమశిక్షణతో కూడిన పొదుపు, పెట్టుబడి రొటీన్ బిల్డ్ చేయడం వల్ల ఆర్థిక స్థితిస్థాపకత బలోపేతం అవుతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget