అన్వేషించండి

ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్

Overusing AI Tools : ఈ మధ్యకాలంలో ప్రతిదానికి AI వాడేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఏఐపై ఆధారపడటం మెదడుకు హానికరమని చెప్తున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

AI Tools and the Human Brain : నేటి యువత AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై ఎక్కువగా ఆధారపడుతుంది. ఆఫీస్ వర్క్స్ నుంచి.. ఆరోగ్య సమస్యల వరకు, ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా చాలామంది AIని ఆశ్రయిస్తున్నారు. అలాగే AI అనేది మనల్ని మనం అప్​డేట్ చేసుకోవాల్సిన ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది. దీంతో ప్రతి చిన్న విషయాన్ని కూడా దానితో చర్చించే అలవాటు చాలామందిలో పెరిగిపోయింది. 

ఒక సర్వే ప్రకారం చాలామంది తమ ఒంటరితనాన్ని అధిగమించడానికి కూడా AIని ఉపయోగిస్తున్నారట. పరీక్షల సమయంలో, చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కోసం, ఆఫీసు పని కోసం ఇలా ప్రతిదానికీ ప్రజలు AIని ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని పనులకు AI  చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. అలా చేయడం వల్ల కూడా ప్రమాదం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దీనికి అనేక కారణాలను అందిస్తున్నారు.  

స్టడీలో భాగంగా ఏమి చేశారంటే..

AI సాధనాలను ఉపయోగించే వ్యక్తుల మెదడుపై ఆలోచనా శక్తి, పని శక్తి ఎక్కువగా ప్రభావితమవుతుందని అనేక పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారు. ఒక అధ్యయనంలో 54 మంది స్వచ్ఛంద సేవకుల బృందంపై స్టడీ చేశారు. వీరిలో ఎక్కువ మంది 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఒక వ్యాసం రాసే పనిని అప్పగించారు. ఈ 54 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక గ్రూపును Chatgptని ఉపయోగించమని, రెండవ గ్రూపును Google AIని ఉపయోగించమని, మూడవ గ్రూపును స్వయంగా వ్యాసం రాయమని టాస్క్ ఇచ్చారు. ఈ సమయంలో శాస్త్రవేత్తలు EEG హెడ్‌సెట్‌ని ఉపయోగించి వారి మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేశారు. 

అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అయితే ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనుగొన్నారు. ఉపాధ్యాయులు తమ వ్యాసాలను రాస్తున్నప్పుడు.. వారి చేతిరాతలో లోతు, భావోద్వేగం లేదని కనుగొన్నారు. ఇంకా ChatGPTని ఉపయోగించిన వారిలో మెదడు కార్యకలాపాలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. Googleని ఉపయోగించి రాసిన వారి మెదడు కార్యకలాపాలు అలా చేయని వారి కంటే ఎక్కువగా కనిపించాయట. మిగిలిన వారు తమ వ్యాసాలలో పెద్ద డెప్త్ లేదని గమనించారు. మరోవైపు తమ సొంత మనస్సు నుంచి వ్యాసాలు రాసిన వారు తమ వ్యాసాలతో ఎక్కువగా అనుసంధానమైనట్లు భావించారు. ఇంకా వాటిని రాసిన వారిలో మానసిక కార్యకలాపాలు అత్యధికంగా, ఉత్తమంగా ఉన్నట్లు గుర్తించారు.

AI సాధనాలపై తక్కువ ఆధారపడితే మంచిదట

పరిశోధన ప్రకారం.. ఈ AI సాధనాలపై ఎక్కువగా ఆధారపడిన వ్యక్తుల మెదడుల్లో చురుకుదనం చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే వారి జ్ఞాపకశక్తి కూడా గణనీయంగా క్షీణించిందట. మెదడు పెరిగే ప్రారంభ సంవత్సరాల్లో ఈ సాధనాలను ఉపయోగించే వ్యక్తులపై గణనీయమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అందువల్ల AI సాధనాలను పరిమితంగా ఉపయోగించాలని అంటున్నారు. లేకుంటే మెదడు పూర్తిగా దాని సామర్థ్యాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.  

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Memory Boosting Tip : నిద్రలేమితో జ్ఞాపకశక్తి తగ్గుతుందా? అయితే రోజూ 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయాలంటోన్న తాజా అధ్యయనం
నిద్రలేమితో జ్ఞాపకశక్తి తగ్గుతుందా? అయితే రోజూ 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయాలంటోన్న తాజా అధ్యయనం
Apple vs Banana : యాపిల్ vs అరటిపండు.. బరువు తగ్గడానికి ఏది మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
యాపిల్ vs అరటిపండు.. బరువు తగ్గడానికి ఏది మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Slim Waist Surgery : నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
నడుమును సన్నగా చేసే రిబ్ మోడలింగ్ సర్జరీ.. ఎంత ప్రమాదమో తెలుసా?
Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget