అన్వేషించండి

Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే

Train Ticket Fare Hike | రైల్వే సబర్బన్ సేవలు, సీజన్ టిక్కెట్ల ధరలలో మార్పు లేదు. 215 కిమీ వరకు సెకండ్ క్లాస్ సాధారణ టిక్కెట్ ధరలో పెరుగుదల లేదు.

Indian Railway Fare Hike | భారతదేశంలో నేటి నుంచి రైల్వే టికెట్ల ధరల పెంపు అమలులోకి వస్తుంది. ఇటీవల రైల్వేశాఖ సుదూర ప్రయాణాలపై టికెట్ ఛార్జీలు పెంచడం తెలిసిందే. ఈ సవరించిన రైళ్ల ఛార్జీలు ఈరోజు (శుక్రవారం) అంటే డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని కోసం రైల్వే డిసెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రయాణికుల సౌకర్యం, నిర్వహణకు ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత లక్ష్యంతో ప్రయాణీకుల ఛార్జీలలో హేతుబద్ధీకరణను ప్రకటించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో, పెరిగిన ఛార్జీలు ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లకు కూడా వర్తిస్తాయా? డిసెంబర్ 26కు ముందు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు ప్రయాణ సమయంలో అదనంగా డబ్బు చెల్లించాలా అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వివరాలు తెలుసుకోండి. 

పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి?

రైల్వేశాఖ సమాచారం ప్రకారం, ఇటీవల సవరించిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చేశాయి. ఇది ఈ తేదీ నుంచి బుక్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు డిసెంబర్ 26కు ముందు టిక్కెట్ బుక్ చేసుకున్నట్లయితే, ఆ తర్వాత తేదీలలో ప్రయాణించాల్సి వచ్చినా, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ కేటగిరీలలో ఛార్జీలు పెరగలేదు

సీజన్ టిక్కెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా, సెకండ్ క్లాస్ సాధారణంలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి సైతం ఎటువంటి ఛార్జీల పెరుగుదల లేదు.

దూరం ఆధారంగా అదనపు ఛార్జీలు

నాన్-ఏసీ సాధారణ రైళ్లలో పెరిగిన ఛార్జీలు దూరం ఆధారంగా వర్తిస్తాయి. ఉదాహరణకు, మీరు 216 కిమీ నుండి 750 కిమీ ప్రయాణానికి ₹5 పెరిగింది. 751 కిమీ నుండి 1250 కిమీ ప్రయాణానికి 10 రూపాయలు అదనంగా చెల్లించాలి. అదేవిధంగా, 1251 కిలోమీటర్ల నుంచి 1750 కిమీ ప్రయాణానికి 15 రూపాయలు, 1751 కిమీ నుండి 2250 కిమీ వరకు టిక్కెట్‌కు 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్ క్లాస్, జనరల్, ఫస్ట్ క్లాస్ ప్రయాణాలలో కిలోమీటరుకు 1 పైసా చొప్పున ఛార్జీలు పెరిగాయి.

రైళ్ల ప్రకారం ఛార్జీలు ఎంత పెరిగాయి?

రైల్వే ప్రకారం, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ,యు ఏసీ రెండూ (స్లీపర్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, ఏసీ 2-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్) కిలోమీటరుకు 2 పైసలు ఛార్జీలు పెరిగాయి. ఉదాహరణకు, 500 కిమీ నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ ప్రయాణానికి ప్రయాణికులు సుమారు ₹10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన ఛార్జీలు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, అంత్యోదయ, గతిమాన్, అమృత్ భారత్, గరీబ్ రథ్, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ తో సహా ఇతర ప్రధాన రైళ్లకు సమానంగా వర్తిస్తాయి.

రైల్వే తెలిపిన సమాచారం 

అంతేకాకుండా రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీలు, ఇతర సహాయక ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. జీఎస్టీ రేట్లు, ఛార్జీల రౌండ్-ఆఫ్ నియమాలు కూడా యథాతథంగా ఉంటాయి. నేటి (డిసెంబర్ 26) నుంచి స్టేషన్లలో ప్రదర్శించే ఛార్జీల జాబితా కూడా కొత్త ఛార్జీల ప్రకారం మాడిఫై చేయనున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget