Kantara:'కాంతార' దేవుళ్ళు నిజంగా ఉన్నారా? పంజుర్లి, గుళిగ గురించి మిమ్మల్నిఆశ్చర్యపరిచే నిజాలు!
Kantara's Panjurli and Gulega: కాంతార సినిమాలో పంజూర్లి, గులేగ పాత్రలు చూపించారు. 2022 లో వచ్చిన ఈ సినిమాలోని దేవుళ్ళ గురించి తెలుసుకుందాం.

Kantara Gods are Real: తక్కువ బడ్జెట్తో నిర్మితమై భారీ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలెన్నో ఉన్నాయ్. సౌత్ ఇండస్ట్రీలో ఈ లెక్క భారీగా ఉంటుంది. ఈ కోవకు చెందినదే 2022లో వచ్చిన రిషబ్ శెట్టి నటించిన కాంతార. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే కారణంగా ఇప్పటికీ ప్రేక్షకుల డిస్కషన్ లో ఉంటుంది. ఈస్థాయి ఆదరణ చూసిన తర్వాత దీనికి ప్రీక్వెల్ తీయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాతో అందరకీ కొత్తగా పరిచయమైన దేవుళ్లు.. పంజుర్లి , గుళిగ
పంజుర్లి , గుళిగ .. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు. కాంతారాతో సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయం చేశారు రిషబ్ షెట్టి అండ్ టీమ్.
పంజుర్లి వరాహ రూపంలో ఉండే ఓ సంరక్షక ఆత్మ
గుళిగ భూమి ప్రకృతిని రక్షించే దేవుడు
ఈ దేవతలు భూత కోల వంటి స్థానిక ఆచారాల్లో భాగంగా పూజలందుకుంటారు.
కాంతారా మూవీ ద్వారా ఈ దేవతలతో ప్రేక్షకులను అనుసంధానం చేయడంలో సక్సెస్ అయ్యారు రిషబ్ శెట్టి.
పంజుర్లి - గుళిగ సంరక్షక ఆత్మలు
చాలా మందికి ఈ సినిమా పాత్రలు కల్పితంగా అనిపిస్తాయేమో.. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీటి మూలం తీర ప్రాంత కర్ణాటక తురునాడి సంప్రదాయం నుంచి వచ్చింది. ఇది 5000 సంవత్సరాల కంటే పాతది. స్థానికులు దీనిని భూత పూజ అని కూడా పిలుస్తారు, అయితే దీనికి దెయ్యాలు లేదా చెడు ఆత్మలతో ఎలాంటి సంబంధం లేదు. కాంతారలో చూపించిన పంజుర్లి ,గుళిగ ఇద్దరూ సంరక్షక ఆత్మలు, ఇవి అడవులు, గ్రామాలు , కుటుంబాలకు సంబంధించినవి. ప్రకృతిని గౌరవించే ..న్యాయాన్ని పాటించే వారిని వీరు రక్షిస్తారు..ప్రకృతిని నాశనం చేయాలి అనుకునేవారిని శిక్షిస్తారు.

ప్రేమ నుంచి జన్మించిన పంజుర్లి
కాంతార సినిమాలో చూపించిన పంజుర్లి కథ నిజంగానే హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. పురాణాల ప్రకారం.. కైలాస పర్వతంపై అడవి పంది చనిపోయిన తరువాత, దాని పిల్ల అనాథగా మారింది. అప్పుడు పార్వతి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు..పవిత్రమైన కైలాసపర్వతంపైనుంచి ఆ వరాహాన్ని బహిష్కరించాడు. అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుర్లిగా మారింది. అడవులు ..ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది. అందుకే అడవులు, ప్రకృతిని గౌరవించే వారికి పంజుర్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం.
గుళిగ ఎలా ఉద్భవించాడు?
పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుర్లి జన్మిస్తే...కోపం నుంచి జన్మించాడు గుళిగ. విశ్వ వినాశనం సమయంలో పరమేశ్వరుడు విసిరిన రాయి నుంచి గుళిగ ఉద్భవించాడని చెబుతారు. గుళిగ దైవిక ప్రతీకారం, న్యాయానికి అవతారంగా పరిగణిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నువ్వు ప్రత్యక్షమవుతావనే ఆశీర్వాదం విష్ణువు నుంచి పొందాడట గుళిగ.
అలా అప్పటి నుంచి పంజుర్లి భూమిని రక్షిస్తే..గుళిగ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాడు
కాంతార సినిమా కాదు.. ఇది ఒక జీవన చరిత్ర
కాంతార ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భూత పూజను పరిచయం చేయడంలో విజయం సాధించింది. ఆధునిక జీవితం నుంచి నెమ్మదిగా అంతరించిపోతున్న ఒక సంప్రదాయం గురించి ఈ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం






















