అన్వేషించండి

IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!

IndiGo Flight Cancellation: ఇండిగో విమానాలు రద్దు తర్వాత DGCA తాత్కాలికంగా FDTL నిబంధనలు సడలించింది. నైట్ డ్యూటీ నిబంధనల సడలింపుతో విమానయానం స్థిరపడే అవకాశం.

IndiGo Flight Cancellation: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు వరుసగా రద్దు కావడంతో, భారీగా ఆలస్యం కావడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం పెరిగింది. వేల మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోవడంతో దేశంలోని విమానయాన నెట్‌వర్క్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఒత్తిడి మధ్య, ఫేజ్-2 FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలు అకస్మాత్తుగా సిబ్బంది లభ్యతను బాగా తగ్గించాయని DGCA అంగీకరించింది. ఇండిగో తన వాస్తవ అవసరాన్ని అంచనా వేయడంలో విఫలమైంది, దీని కారణంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిన తర్వాత, జాతీయ విమానయాన నెట్‌వర్క్‌ను స్థిరీకరించడానికి తాత్కాలిక ఉపశమనం ఇవ్వడం అవసరమని DGCA నిర్ణయించింది.

FDTL కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత తన ప్రణాళిక, రోస్టరింగ్ ఉండాల్సినంత బలంగా లేదని ఇండిగో DGCAకి తెలిపింది. నైట్ షిఫ్ట్ డ్యూటీ, విశ్రాంతి సమయం, డ్యూటీ అవర్స్,  సిబ్బంది లభ్యత సంఖ్యను ఒక్కసారిగా తగ్గించింది. పైలట్‌లు, క్యాబిన్ సిబ్బంది అవసరాన్ని తప్పుగా అంచనా వేసినట్లు ఎయిర్‌లైన్ అంగీకరించింది, దీని కారణంగా రద్దుల ప్రక్రియ వేగవంతమైంది. త్వరలో అదనపు సిబ్బందిని నియమించుకుంటామని, తద్వారా అన్ని నిబంధనలను పూర్తిగా పాటించేలా చూస్తామని ఇండిగో హామీ ఇచ్చింది.

DGCA నుంచి ఉపశమనం

DGCA అందించిన ఉపశమనం రెండు ప్రత్యేక నిబంధనలకు సంబంధించినది. మొదటిది పేరా 3.11, ఇది రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ డ్యూటీని నియంత్రిస్తుంది. రెండోది పారా 6.1.4, ఇది నైట్-డ్యూటీ సమయంలోకి ప్రవేశించే విమానాలను నిరోధించింది. ఈ రెండు నిబంధనల్లో తాత్కాలిక సడలింపుతో, ఇండిగో రాత్రి విమానాలను అధిక ఆంక్షలు లేకుండా నడపడానికి వీలు కలుగుతుంది.  సిబ్బంది వినియోగంలో కూడా మెరుగుదల ఉంటుంది.

మినహాయింపు ఫిబ్రవరి 10, 2026 వరకు అమలులో ఉంటుంది

ఈ మినహాయింపు ఫిబ్రవరి 10, 2026 వరకు అమలులో ఉంటుంది, అయితే దీనితో పాటు కఠినమైన తనిఖీలు, పర్యవేక్షణ నిబంధనలు కూడా జోడించారు. ప్రతి 15 రోజులకు సిబ్బంది వినియోగం, లభ్యతను పెంచడానికి తీసుకున్న చర్యలు, కార్యకలాపాలలో మెరుగుదల, కొత్త రోస్టరింగ్ మోడల్‌తో సహా పురోగతి నివేదికను సమర్పించాలని DGCA ఎయిర్‌లైన్‌కు ఆదేశించింది. అదే సమయంలో, సిబ్బంది నిర్వహణ, షెడ్యూలింగ్,  రెగ్యులేషన్ కంప్లైన్స్‌కు సంబంధించిన స్పష్టమైన సూచనలతో సహా వివరణాత్మక రోడ్‌మ్యాప్‌ను 30 రోజుల్లోపు సమర్పించడం ఇండిగోకు తప్పనిసరి. FDTL మిగిలిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని, మరే ఇతర నిబంధనలోనూ మినహాయింపు ఉండదని DGCA స్పష్టం చేసింది. పరిస్థితి మరింత దిగజారినా లేదా సమ్మతి లోపిస్తే, DGCA ఏ సమయంలోనైనా ఉపశమనాన్ని ఉపసంహరించుకోవచ్చు. DGCA ఈ తాత్కాలిక ఉపశమనం ప్రస్తుతం విమానయాన పరిశ్రమకు కొంత స్థిరత్వాన్ని అందించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు విమానాలు రద్దు కాకుండా ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పుడు కొత్త నిబంధన ఏమి చెబుతోంది?

కొత్త ఉత్తర్వు ఎయిర్‌లైన్స్‌కు చాలా సౌలభ్యాన్ని ఇచ్చింది. ఏదైనా పైలట్ లేదా క్యాబిన్ సిబ్బందికి సెలవు ఇస్తే, అది వారపు విశ్రాంతికి సమానంగా పరిగణిస్తారు. ఇది ఎయిర్‌లైన్స్ ఎటువంటి అంతరాయం లేకుండా రోస్టర్‌ను సిద్ధం చేయడానికి , విమాన షెడ్యూల్‌ను మరింత స్థిరంగా ఉంచడానికి వీలు కల్పిస్తుంది.

ప్రయాణికులకు ఎలా ప్రయోజనం?

కొత్త మార్పు నేరుగా ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుంది. అధిక ఆలస్యం , రద్దు చేసిన విమానాల సంఖ్య తగ్గుతుంది. ఎయిర్‌లైన్స్ తమ రోజువారీ కార్యకలాపాలను సాధారణ వేగంతో నిర్వహించగలుగుతాయి, దీనివల్ల ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Advertisement

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
భారత్ లో విడుదలైన Harley Davidson X440T, పలు కొత్త ఫీచర్లు- ధర ఎంతో తెలుసా
భారత్ లో విడుదలైన Harley Davidson X440T, పలు కొత్త ఫీచర్లు- ధర ఎంతో తెలుసా
Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Embed widget