Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Raj Bhavan as Lok Bhavan: భారతదేశంలోని అన్ని రాజ్ భవన్‌లు లోక్ భవన్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి కార్యాలయం పేరును సేవా తీర్థ్‌గా పిలుస్తారు.

Telangana to rename Raj Bhavan as Lok Bhavan Raj Niwas as Lok Niwas రాజ్ భవన్ పేర్లు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో కూడా అమలులోకి వచ్చింది. హోం మినిస్ట్రీ (MHA) ఆదేశాల ప్రకారం, తెలంగాణ రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా, రాజ్ నివాస్‌ను లోక్ నివాస్‌గా మార్చారు. ఈ మార్పు, బ్రిటిష్ కాలోనియల్ కాలనికి సంబంధించిన రాజ్ పదాన్ని తొలగించి, ప్రజలకు దగ్గరగా ఉండే లోక్ అనే పేరుతో మార్చాలని నిర్ణయించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) నవంబర్ 25, 2025న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖ రాసింది. ఈ లేఖలో, రాజ్ భవన్ , రాజ్ నివాస్ పేర్లు బ్రిటిష్ కాలోనియల్ కాలానికి చెందినవి అని, వాటిని లోక్ భవన్, లోక్ నివాస్ గా మార్చాలని సూచించారు. ఈ సూచన 2024లో జరిగిన గవర్నర్ల సమావేశంలో చర్చకు వచ్చింది. మోదీ ప్రభుత్వం ఈ మార్పును దేశంలోని కాలోనియల్ వారసత్వాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా చూస్తోంది. ఇప్పటికే రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా, అధికారిక కమ్యూనికేషన్‌లలో 'ఇండియా'కు బదులు 'భారత్' ఉపయోస్తున్నారు. బీటింగ్ రిట్రీట్ సెరిమోనీలో ఆంగ్ల గీతాలను తొలగించడం వంటి చర్యలు ఇందులో భాగమే.
Name Change—
— @Coreena Enet Suares (@CoreenaSuares2) December 2, 2025
The official residence of the Governor of Telangana, hitherto known as “Raj Bhavan, Telangana,” shall henceforth be called as “Lok Bhavan, Telangana.”
This has been done to reiterate the strength and vibrancy of our democratic values as we march with confidence…
వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిశా, గుజరాత్, త్రిపురా రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా మార్చాయి. లడాఖ్ రాజ్ నివాస్‌ను లోక్ నివాస్‌గా మార్చింది . తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరి, రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా మార్చాలని నిర్ణయించారు. తెలంగాణ రాజ్ భవన్ ఇక నుంచి అధికారికంగా లోక్ భవన్ గా పిలుస్తారు. గవర్నర్ ఆఫీస్ నుంచి విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, ఈ మార్పు తక్షణమే అమలులోకి వచ్చింది. భవన ప్రవేశ ద్వారాలపై 'రాజ్ భవన్' బోర్డులను తొలగించి, 'లోక్ భవన్' బోర్డులు ఏర్పాటు చేస్తారు. అలాగే, మీడియా వాట్సాప్ గ్రూప్‌లు, అధికారిక ఈమెయిల్‌లు, డాక్యుమెంట్లలో కూడా ఈ మార్పు చేశారు. [tw]
Happy to share a meaningful milestone for Odisha as Raj Bhavan is now Lok Bhavan, a name that truly reflects the aspirations of our people.
— Dr. Hari Babu Kambhampati (@DrHariBabuK) December 1, 2025
Inspired by the vision of Hon’ble Prime Minister Shri Narendra Modi and guided by the Ministry of Home Affairs, this change reinforces our… pic.twitter.com/HV0wQcR2s5
ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్.. పీఎంవోను ఇక పీఎంవోగా వ్యవహరించరు. సేవా తీర్థ్ గా పిలుస్తారు.





















