అన్వేషించండి

Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్

Chennamaneni Ramesh గత పదిహేనేళ్లుగా వేములవాడ ప్రజలను, ప్రభుత్వాలు, న్యాయస్థానాలను మోసం చేసి ఎమ్మెల్యేగా గెలిచాడని, ఆయనకు ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

Vemulawada News | వేములవాడఫ 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో న్యాయం గెలిచిందని పిటిషనర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని రమేష్ తప్పుడు ధ్రువ పత్రాలతో న్యాయస్థానాలను, ప్రభుత్వాలను మోసం చేశారని... ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హైకోర్టు చెన్నమనేని రమేష్ భారత దేశ పౌరుడు కాదని తీర్పు ఇచ్చిందన్నారు. దాంతో పాటు 15 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్న తనకు 25 లక్షల రూపాయలు, లీగల్ సెల్ కు 5 లక్షల రూపాయలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే.

హైకోర్టు తీర్పుతో ఈరోజు చెన్నమనేని రమేష్ 25 లక్షలు తన లాయర్ల ద్వారా ఆది శ్రీనివాస్‌కు డీడీ అందించారు. దాంతో పాటు కోర్టు తీర్పు ప్రకారం 5 లక్షల రూపాయలు తన లీగల్ సెల్ కు కూడా చెల్లించారని ఆది శ్రీనివాస్ తెలిపారు. చెన్నమనేని రమేష్ 4 సార్లు ప్రజలను మోసం చేసి గెలిచారని.. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై డీజీపికి ఇదివరకే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి ఎన్నికల్లో  పోటీ చేస్తూ వేములవాడ ప్రజలను మోసం చేసినందుకు చెన్నమనేని రమేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2009 నుండి 2023 వరకు మోసం చేసి గెలిచినందున, ఆయన ఎమ్మెల్యే కాదని గెజిట్ నోట్ విడుదల చెయ్యాలని ఆది శ్రీనివాస్ కోరారు. మాజీ ఎమ్మెల్యే కూడా కాకుండా అతనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చూడాలన్నారు. మోసం చేసి గెలిచిన వ్యక్తి కనుక ఆ సమయంలో ఎమ్మెల్యే కాదు అని హైకోర్టు స్పష్టం చేసిందని, దాంతో ఆయన మాజీ ఎమ్మెల్యే ఎలా అవుతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇన్నాళ్లపాటు న్యాయపోరాటం చేస్తున్న తన కేసును వాదించిన సీనియర్ కౌన్సిల్ వి. రవి కిరణ్ రావు, రోహిత్ రావు లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 

చెన్నమనేని జర్మనీ పౌరుడేనని తేల్చిన హైకోర్టు

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు గత ఏడాది డిసెంబర్ నెలలో బిగ్ షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు  కొట్టేసింది. ఆయన జర్మనీ పౌరుడేనని, ఇన్నాళ్లు మోసం చేశాడని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జర్మనీ పౌరుడిగా ఉంటూనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని కోర్టు స్పష్టం చేసింది. తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లు మోసం చేసిన చెన్నమనేని రమేష్ కు హైకోర్టు రూ.30 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

చెన్నమనేని రమేశ్ తప్పుడు ధ్రువపత్రాలు, సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పలు మార్లు కోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడని, ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సాగింది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేయడం తెలిసిందే. దీన్ని చెన్నమనేని హైకోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన హైకోర్టు ఆయన జర్మనీ పౌరుడని, ఆయన ఎన్నికల చెల్లదని గతంలోనూ ఎమ్మెల్యేగా పరిగణించకూడదని తీర్పు వెలువరించింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget