Breezer and Health Risks : బ్రో బ్రీజర్ సాఫ్ట్ డ్రింక్ కాదు ఆల్కహాల్ ఉంటుందట జాగ్రత్త.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే
Breezer : ఆల్కహాల్ తీసుకోను కానీ బ్రీజర్ తాగుతాను అనుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఇక్కడున్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత తాగాలో వద్దో ఆలోచించుకోండి.

Breezer is An Alcoholic Beverage : ఫ్రెండ్స్ సిట్టింగ్ వేస్తే.. బ్రో నేను ఆల్కహాల్ తీసుకోను.. కానీ బ్రీజర్ తాగుతాను.. ఒకటి తీసుకొచ్చేయి అని అంటున్నారా? అయితే జాగ్రత్త మీరు తీసుకునేది కూడా ఆల్కహాలే. ఎందుకంటే బ్రీజర్‌లో కూడా ఆల్కహాల్ ఉంటుందట. అది కూడా తక్కువ కాదు.. చిన్న బీర్లో ఉండేంత ఆల్కహాల్ ఉంటుందట. అయితే ఫ్రూట్ జ్యూస్ ఫ్లేవర్ ఉండడం వల్ల, తియ్యగా అనిపించడం వల్ల దానిలో ఆల్కహాల్ ఉండదని చాలామంది అనుకుంటారట.
ఈ విషయం చాలామందికి తెలియక బ్రీజర్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్‌గా చూస్తారు. అలాగే దానిని ఫ్రూట్ జ్యూస్‌కి రిప్లేస్మెంట్లా తీసుకుంటారు. అందుకే బ్రీజర్ని తాగేప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని తాగితే మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే ఆల్కహాల్ కొన్నిసార్లు మత్తు ఇవ్వొచ్చు. లేదా మీరు అబ్నార్మల్గా బిహేవ్ చేసే వైబ్‌ని ఇవ్వొచ్చు. మిమ్మల్ని ఇబ్బందుల్లో కూడా పడేయొచ్చు. అందుకే బ్రీజర్ గురించి కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
బ్రీజర్ సాఫ్ట్ డ్రింక్ కాదు..
బ్రీజర్ అనేది ఆల్కహాలిక్ డ్రింక్. ఇది ఫ్రూట్ ఫ్లేవర్‌లో అందుబాటులో ఉన్నా.. ఆల్కహాల్ శాతం కొంత ఉంటుంది. ఈ ఫ్లేవర్ వల్లే చాలామంది దీనిని సాఫ్ట్ డ్రింక్‌లా తీసుకుంటారు. కానీ ఇది కూడా మద్యపాన పానీయమే. అయితే దానిలో తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉంటుంది. సుమారు ఓ బ్రీజర్‌లో 4% - 5% ఆల్కహాల్ ఉంటుంది. బ్రాండ్‌ని బట్టి, ఫ్లేవర్‌ని బట్టి ఈ పర్సెంటేజ్ మారొచ్చు.
బ్రీజర్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్..
బిగినర్స్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్రెండ్స్ బ్రీజర్ తాగుతుంటే.. లేదా ఆల్కహాల్ కాదనుకుని బ్రీజర్ తాగేవాళ్లు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఎందుకంటే బ్రీజర్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మత్తులోకి వెళ్లడం, తలనొప్పి, నిద్ర ఎక్కువగా రావడం వంటివి జరుగుతాయి. మరికొందరికి కళ్లు తిరుగుతాయి. ఆల్కహాల్ కాదనుకుని డ్రైవింగ్ చేసేవారికి వాహన ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ. కడుపు తిప్పడమే కాకుండా.. అలసటను పెంచుతుంది. కాబట్టి బ్రీజర్ని మొదటిసారి తీసుకునేవారు మరింత జాగ్రత్తగా, సేఫ్ ప్రదేశంలో ఉన్నారో లేదో.. మీ బాడీ ఈ సైడ్ ఎఫెక్ట్స్‌కి తట్టుకుంటుందో లేదో చెక్ చేసుకోవాలి.
బ్రీజర్ ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలివే..
నాన్ ఆల్కహాలిక్ డ్రింక్‌గా బ్రీజర్ని ఎక్కువకాలం.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని నష్టాలు ఉన్నాయి. లివర్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఆల్కహాల్‌కి మెల్లిగా అలవాటు పడిపోతారు. వ్యసనంగా మారే ప్రమాదముంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. బరువు పెరుగుతారు. చర్మ సమస్యలు, హార్మోన్ల సమస్యలు రావొచ్చు.
తక్కువ మోతాదులో తీసుకుంటే..
సేఫ్‌గా ఉన్నప్పుడు.. తక్కువ మోతాదులో బ్రీజర్ తీసుకుంటే.. స్ట్రెస్ తాత్కాలికంగా తగ్గుతుంది. ఫ్రెండ్స్‌తో చిల్ అవుతూ కాస్త రిలాక్స్‌గా ఫీల్ అవొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బ్రీజర్ తీపిగా, ఫ్రూట్ ఫ్లేవర్‌లో ఉన్నా అది మద్యపానమే. కాబట్టి గర్భిణీలు, పిల్లలు, ఆరోగ్య సమస్యలకోసం మందులు ఉపయోగించేవారు దీనిని తాగకూడదు. ఒకవేళ దానిని తీసుకోవాల్సి వచ్చినా.. మితంగా తీసుకుంటే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.




















