Diabetes vs Alcohol : డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్ ఎందుకు తాగకూడదో తెలుసా? తాగితే కలిగే అనర్థాలివే
Diabetes and Alcohol Intake : మీకు మధుమేహముందా? అయితే మీరు ఎట్టి పరిస్థుతుల్లోనూ మందు జోలికి వెళ్లకూడదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్ తాగితే ఏమౌతుందంటే..
Consequences Of Alcohol Use In Diabetes : ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆరోగ్య సమస్యల్ని బాగా పెంచుతుంది. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడేవారికి ఇది ఓ పాయిజన్ అని చెప్తున్నారు నిపుణులు. తీసుకునే ఫుడ్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన డయాబెటిక్ పేషెంట్లు.. మందు తాగితే ఏమైనా ఉందా అంటున్నారు. ఇంతకీ షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ ఎందుకు తీసుకోకూడదు.. తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మందు తీసుకుంటే కలిగే అనర్థాలు ఇవే..
- బ్లడ్ షుగర్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే ఆల్కహాల్ రక్తంలోని చక్కెర స్థాయిలను అమాంతం పెంచడం, తగ్గించడం చేస్తుంది. దీనివల్ల మధుమేహం కంట్రోల్ అవ్వడం కష్టమై.. ప్రాణాలకు ప్రమాదమవుతుంది.
- ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డయాబెటిస్ ఉన్నవారిలో హైపోగ్లైసీమియా పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. ఇది షుగర్ పేషెంట్లలో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.
- మీకు షుగర్ ఉన్నా.. దీర్ఘకాలంగా ఆల్కహాల్ తీసుకుంటే.. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్‌లోని కణాలను దెబ్బతీస్తుంది. మధుమేహాన్ని తీవ్రతరం చేస్తుంది.
- అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నరాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇది మధుమేహమున్నవారిలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
- ఆల్కహాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఇన్సులిన్ నిరోధకతను కూడా ఇది నాశనం చేస్తుంది. మధుమేహమున్నవారు బరువు పెరిగితే.. బీపీ కూడా అదే రేంజ్లో పెరుగుతుంది.
- ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా డయాబెటిక్ పేషెంట్లకు పెంచుతుంది ఆల్కహాల్. అధిక ఆల్కహాల్ రోగనిరోధక శక్తిని మరింత క్షీణించేలా చేసి.. ఇన్ఫెక్షన్లు పెరిగేలా చేస్తుంది. అలాగే మధుమేహాన్ని కంట్రోల్ చేసేందుకు వినియోగించే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
గుర్తించుకోవాల్సిన విషయాలివే..
బీర్, స్వీట్ కాక్టైల్స్ వంటి కొన్నిరకాల ఆల్కహాల్.. మధుమేహమున్నవారికి మరీ ప్రమాదకరంగా మారతాయి. అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే మధుమేహ సమస్యలు మరింత పెరుగుతాయి. మితంగా తీసుకుంటే ఈ ప్రమాదం కాస్త తగ్గుతుంది కానీ.. అంత మంచిది కాదు. మధుమేహం ఉన్న వ్యక్తులు మద్యం తీసుకోవాల వద్దా అనేది రక్తంలోని షుగర్ లెవెల్స్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ఏది ఏమైనా డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే కాంప్లికేషన్స్ పెరుగుతాయనే చెప్తున్నారు నిపుణులు.
ఆల్కహాల్ మాత్రమే కాదు.. స్మోకింగ్ కూడా మధుమేహాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ రెండూ అలవాట్ల వల్ల శరీరంలో బీపీ పెరుగుతుందని.. ఇది క్రమంగా గుండె సమస్యలను పెంచి.. ప్రాణాలకు ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు నిపుణులు. హెల్తీ డైట్ తీసుకుంటూ.. రెగ్యులర్ వ్యాయామాలు చేస్తూ ఉంటే.. మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు.
Also Read : కాఫీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఈ డ్రింక్‌తో మధుమేహం, గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చట, కానీ కండీషన్స్ అప్లై
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.