Yash: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
Ramayana Part 1: కన్నడ స్టార్ యశ్.. త్వరలోనే 'రామాయణ' మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అంతకు ముందు ఆయన ఉజ్జయినీ మహాకాళేశ్వరున్ని దర్శించుకున్నారు.

Yash To Join In Ramayana Movie Shooting: కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) సోమవారం ఉదయం ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే ఆయన 'రామాయణ పార్ట్ 1' (Ramayana Part 1) మూవీలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
సెంటిమెంట్ రిపీట్
ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ను దర్శించుకున్న తర్వాత యశ్ మీడియాతో మాట్లాడారు. తాము శివుణ్ని ఎక్కువగా ఆరాధిస్తానని.. స్వామి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అందరి క్షేమం కోసమే తాను పూజలు చేసినట్లు చెప్పారు. అయితే, యష్ తన ప్రతీ సినిమాను ఆలయ సందర్శనతో ప్రారంభిస్తారు. ఇందులో భాగంగానే 'రామాయణ' మూవీలో భాగం అయ్యే ముందు శివున్ని దర్శించుకున్నారు.
రావణునిగా యష్
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథలాజికల్ ఎపిక్‌గా 'రామాయణ' మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranabir Kapoor) రాముడిగా.. సాయిపల్లవి (Sai Pallavi) సీతమ్మగా నటిస్తున్నారు. ఇందులో రావణుని పాత్రలో యశ్ కనిపించనున్నారు. ఈ వారమే ఆయన ప్రాజెక్టులో భాగం కానున్నారని తెలుస్తోంది. సినిమా సెట్‌లోకి అడుగు పెట్టడానికి ముందే యష్ ఉజ్జయినీ వెళ్లారని పలు కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుందని పలు మీడియా కథనాల బట్టి తెలుస్తోంది. 'పార్ట్ 1' షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో 'పార్ట్ 2'ను సైతం అప్పుడే పట్టాలెక్కించేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో యశ్ రావణుడి రోల్ చేయడమే కాకుండా.. తన బ్యానర్ అయిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో పాటు మల్హోటా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నమిత్ మల్హోత్రా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
వచ్చే ఏడాది దీపావళికి..
'రామాయణ పార్ట్ 1' వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 'పార్ట్ 2' 2027 దీపావళికి రిలీజ్ కానుంది. ఈ మూవీస్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'యశ్' ప్రస్తుతం 'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుగుతుండగా.. త్వరలోనే కొన్ని కీలక సీన్స్ చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న 'టాక్సిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లోకీ డబ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ట్రెండింగ్ అవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై.. వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మూవీలో డారెల్ డిసిల్వా అనే హాలీవుడ్ నటుడితో పాటు అక్షయ్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే నయనతార, కియారా అద్వానీ ఫిమేల్ లీడ్స్‌గా కనిపించబోతున్నారు.





















