అన్వేషించండి

Sri Krishnadevaraya: పతనమవుతున్న శ్రీ కృష్ణదేవరాయలు ఘనకీర్తి, వైభవం.. స్థానికుల మండిపాటు

Andhra Pradesh News | విజయనగర రాజులలో గొప్పరాజైన శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండను వేసవి విడిదిగా, రెండో రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. కానీ అప్పటి కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్నా పట్టించుకోవడం లేదు.

Vijayanaga Empire | సత్యసాయి జిల్లా :  విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీక్రిష్ణ దేవరాయలు ఖ్యాతి గాంచిన ప్రాంతం పెనుకొండ.  శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండను తన రాజధానిగా చేసుకుని పాలించాడు. రాయలు వేసవి విడిది పెనుకొండ. వేసవి విడిదిగా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించాడు. అప్పటి రాయల కాలంలో నిర్మించిన ప్రాచీన కట్టడలు, ప్రముఖ దేవాలయాలు, నేటికి కళారంగానికి అద్దం పడుతున్నాయి. రోజుకు ఒక దేవాలయం చొప్పున సంవత్సరంనకు సరిపడే 365 రోజులకు గాను 365 దేవాలయాలను నిర్మించిన ఘనత రాయలకే దక్కుతుంది. అయితే కొన్ని కాలక్రమేణా నేలమట్టం కాగా మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని నేటికీ పూజలు, పునస్కారాలు జరుగుతూ వస్తున్నాయి. అలాంటి ఘనకీర్తి ఉన్న పెనుకొండ నేడు పాలకులు, అధికారులు పట్టించుకునేవారులేక కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది.


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఒక చారిత్రాత్మక ప్రాంతం. ఇక్కడ ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను కోటగోడలను వీక్షించడానికి దేశం నలుమూలల నుండి సందర్శకులు వస్తూ ఉంటారు. అంతే కాక గతంలో రాయల కీర్తిని చాటించడానికి పలు దఫాలుగా రాయల ఉత్సవాలను ప్రభుత్వం ఇక్కడ జరిపింది. అయితే ఆ ఉత్సవాలలో ప్రజా ప్రతినిధులు పెనుకొండను పర్యాటక హబ్ గా మారుస్తామని, కృష్ణదేవరాయలు నిర్మించిన కట్టడాలకు, దేవాలయాలకు భద్రతలు కల్పిస్తామని హామీలను ఇచ్చారు. అవి నేటికి అమలకు నోచుకోలేదు.


Sri Krishnadevaraya: పతనమవుతున్న శ్రీ కృష్ణదేవరాయలు ఘనకీర్తి, వైభవం.. స్థానికుల మండిపాటు
 పెనుకొండ  దేవాలయాల కట్టడాలలో రోజురోజుకి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని ముఖ్యమైన కట్టడాలు గగన్ మహల్, తిమ్మరుసు బందీఖానా, గాలిగోపురం, బసవన్న బావి తదితర కట్టడాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అలనాటి కళా నైపుణ్యానికి భద్రత కల్పిస్తుంది. కొన్ని కట్టడాలు గుప్తనిధుల పేరుతో ఇప్పటికే ద్వంశం చేసేశారు. వీటిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకులేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమైన కట్టడాలలో రాంబురుజు, కొండపైన నరసింహస్వామి దేవాలయం, మహామంత్రి తిమ్మరుసు సమాధి, శివాలయాలలోని భావి ఇప్పటికే గుప్తనిధుల వేటగాల్ల చేతులలో పడి నేలమట్టమైనాయి. అవి చూడాలన్న నేటితరం వారికి ఫోటోలు తప్ప కట్టడాలు చూసే భాగ్యం లేదు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టకపోవడం చర్యలు తీసుకోక పోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆనాడు విజయనగర సామ్రాజ్యం అంటేనే రాయల కీర్తిని చాటుతుంది. అప్పటికే (500 సంవత్సరాల ముందే) విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజదాని హంపి కాగా రెండవరాజదాని పెనుకొండ అని చరిత్ర చెబుతున్నది. ఇప్పటికి పెనుకొండ కోట గోడ మీద గల శాసనాలు వాటికి రుజువులు కాగా, కట్టడాల అవశేషాలు వాటికి ప్రత్యక్ష నిదర్శనాలు. క్రిష్ణదేవరాయల ఆస్తాన మంత్రి అప్పాజీని బందించిన ప్రదేశం తిమ్మరుసు బందీఖాన ఇప్పటికి పెనుకొండలో పర్యాటకులకు దర్శనం ఇస్తున్నది. ఎంతటి వేసవి కాలములోనైనా చల్లగా ఉండగల ప్రదేశం గగన్ మహల్ ఇప్పటికి సజీవ సాక్షంగా కనిపిస్తున్నది.

ఆనాడు రాణి వాసాం వారు స్నానానికి కట్టబడిని స్విమ్మింగ్ పూల్ వాటిలోనికి నీటిని చేర్చడానికి నింపిని నీటిట్యాంకు లు కనపడుతున్నాయి. అవేకాక కొండను ఎక్కుతున్నప్పుడు అలసట తీర్చుకోవడానికి అక్కడక్కడ మజిలీలు (గాలిపటాలు) దర్శనమిస్తాయి. అంతేకాక నూరుస్తంబాల మండపాలు కొండపైన ఇప్పటికి అవశేషాలతో దర్శనమిస్తున్నది.

పెనుకొండ కొండపైన నరసింహ స్వామి దేవాలయం నందు గుప్తనిధుల వేటగాల్లు పూర్తీగా త్రవ్విసిన దృశ్యాలు చూసి పర్యాటకులు కొందరు రాయల వైభవానికి చెదలు పడుతున్నాయి అన్న విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. అలాంటి చరిత్ర కలిగిన పెనుకొండ నేడు ఆదరణకు కరువై పాలకుల అండదండలు లేక కలాకండాలు భూ స్థాపితమౌతున్నాయి.
పాలకులు, అధికారులు ఇప్పటికైనా వీటిని సమగ్రంగా సంరక్షించినట్లు అయితే పెనుకొండ పర్యాటకులను ఆకర్శించే విధంగా ఉంటుందని పర్యాటకులు, స్థానికులు కోరుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget