AI Effect On Middle Class: హలో మధ్యతరగతి మాష్టారు ఇది మీ కోసమే! త్వరలో మీరు రోడ్డున పడబోతున్నారు! మీకు అర్థమవుతుందా!
AI Effect On Middle Class: నమ్మకమైన ఉద్యోగిగా ఒకే కంపెనీలో ఉంటూ మిడిల్‌క్లాస్ లైఫ్‌ను లీడ్ చేస్తున్న వాళ్లకు ఇదో హెచ్చరిక. మిమ్మల్ని మింగేయడానికి వస్తున్న AIపై నిపుణులు ఏమంటున్నారంటే...

AI Effect On Middle Class: మిడిల్ క్లాస్... ఈ పేరు వినగానే ఏళ్ల తరబడి ఒకే ఉద్యోగం చేస్తూ జీతాన్ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడుతూ జీవితాన్ని లాగించుకొచ్చే సామాన్యుడు మైండ్‌లో మెదులుతాడు. మరి కొంతమంది ఆర్థిక రంగ నిపుణుల ప్రకారం ఆర్థిక వ్యవస్థకు చాలా చాలా ముఖ్యమైన ఆధారభూతంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. ఇలా ఏళ్ల తరబడి ఒకే కంపెనీలోనో లేక ఒకే ఉద్యోగంలోనో కొనసాగే మధ్య తరగతి జీవి ఇక ఉండడని ఉద్యోగాలన్నీ మాయం కాబోతున్నాయని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణం ప్రచండ వేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీ,,
ముంచుకొస్తున్న ప్రమాదం: మార్కెట్ ఎనలిస్ట్ సౌరబ్ ముఖర్జీయా
ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ సౌరబ్ ముఖర్జయా ఇటీవల ఒక పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ దూసుకొస్తున్న ఏఐ ప్రభంజనంపై ఆందోళనవ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం" పెద్ద చదువులు చదివి మంచి జీతంతో ఏదో ఒక కంపెనీలో చేరితే జీవితం సెటిల్ అయినట్టే అని సగటు మధ్యతరగతి విద్యార్థి భావిస్తుంటాడు. అదే కంపెనీలోనో లేక అదే ఉద్యోగం లోనో ఏళ్ల తరబడి కష్టపడి పని చేస్తూ సెటిల్ అయిపోదామని ఆలోచిస్తారు. కానీ ఏఐ వల్ల అలాంటి పరిస్థితి ఉండదు.
ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతూ ఉంది. చాలావరకు ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. అంతా టెక్నాలజీయే చేసుకుపోతుంది. కాబట్టి చాలా వరకు మధ్యతరగతి ఉద్యోగాలు లేక ఆల్టర్నేటివ్ ఎంచుకోవలసి వస్తుంది." కాబట్టి ఒకే ఉద్యోగంలోనో లేక ఒకే జీతంతోనో బతికేద్దాం అంటే ఇకపై కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగులపై ఉంటుందని అలా లేని వాళ్ళ ఉద్యోగాలు పోతాయని దీని ప్రభావం మిడిల్ క్లాస్‌పై చాలా తీవ్రంగా పడబోతుందని ఇతర మార్కెట్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AI తో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది: ఒబామా, బిల్ గేట్స్
అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ బరక్ ఒబామా, టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. " AI వల్ల నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లు ఏళ్ల తరబడి సంపాదించిన జ్ఞానాన్ని AI సెకన్లలో విద్యార్థులకు అందిస్తుందని, అలాగే మెడికల్, మీడియా, IT లాంటి కీలక రంగాల్లో భారీ మార్పులు రానున్నాయు. సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే పనిలో 65-70శాతం పనులు AI చేస్తోంది. మరి వాళ్ళు ఉద్యోగాలన్నీ ఏమవ్వాలని ఇదంతా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశంగా"వారు అభిప్రాయపడుతున్నారు.
ఇతర ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టాలి: నిపుణులు సూనచ
రానున్న పదేళ్లలో ఉద్యోగ రంగంలో AI సమూలంగా మార్పులు తెచ్చేస్తుందని. దానికి సిద్ధపడి టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లకపోతే ఉపాధి లభించే అవకాశం చాలా కష్టమవుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తూనే కేవలం ఉద్యోగంపైనే ఆధారపడకుండా వేరే వేరే ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని మిడిల్ క్లాస్‌కు ఆర్థిక, సాంకేతిక రంగాల నిపుణులు సలహా ఇస్తున్నారు. లేకుంటే ప్రమాదం బారిన పడతారని వార్నింగ్ ఇస్తున్నారు.





















