KKR vs GT Match Highlights IPL 2025 | కోల్ కతా నైట్ రైడర్స్ పై 39 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ | ABP Desam
ఐపీఎల్ సెకండ్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. ఇక ప్లేఆఫ్స్ లో నిలవాలంటే ఎక్కువ మ్యాచ్ లు గెలవాల్సిందే అన్న హోరా హోరీ పోరులా మారిపోయింది. ఇలాంటి ఇవాళ గెలుపే లక్ష్యంగా గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టింది కోల్ కతా నైట్ రైడర్స్. కానీ మ్యాచ్ అంతటా జీటీ డామినేషన్ సాగి కేకేఆర్ పై 39 పరుగుల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. సాయి సుదర్శన్ దూకుడు
ఈ సీజన్ మొదలైన దగ్గర్నుంచి గుజరాత్ టైటాన్స్ అన్నప్పుడల్లా తప్పనిసరిగా వినిపిస్తున్న పేరు సాయి సుదర్శన్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ తప్పని భావిచేలా జీటీ ఓపెనర్ సాయి తన కెప్టెన్ గిల్ తో కేకేఆర్ బౌలింగ్ ను రఫ్పాడించాడు. 36 బాల్స్ లో 6 ఫోర్లు ఓ సిక్సర్ తో బాది 52 పరుగులు చేయటమే కాదు ఈ సీజన్ లో ఐదో హాఫ్ సెంచరీ బాదేసి ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు సాయి సుదర్శన్. గిల్ తో సాయి చూపించిన దూకుడు తో గుజరాత్ 12 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యం పెట్టింది.
2 . కెప్టెన్ గిల్ షో
ఓ ఎండ్ లో సాయి బాదుతుంటే మరో ఎండ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ రచ్చ లేపాడు. కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేసి ఆడుతూ పరుగుల వరద పారించాడు. గిల్ అయ్యాక బట్లర్ తో జోరు కొనసాగించాడు. 55 బాల్స్ లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 90 పరుగులు చేసి గిల్ వైభవ్ అరోరా బౌలింగ్ లో సిక్సు, ఫోరు కొట్టి అదే దూకుడు అవుటైపోయాడు. లేదంటే ప్రిన్స్ ఈరోజు సెంచరీ బాదేసేవాడే.
3. బట్లర్ కేమియో
సాయి సుదర్శన్ అవుటయ్యాక బట్లర్ రావటం రావటమే హ్యాట్రిక్ బౌండరీలతో రస్సెల్ మీద విరుచుకపడ్డాడు. మొత్తంగా 23 బాల్స్ లో 8 ఫోర్లు బాది 41 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసేలా ఇన్నింగ్స్ ను తీసుకువెళ్లాడు బట్లర్.
4. రహానే కెప్టెన్సీ ఆట
199 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా ఆట ముందు నుంచి నీరసంగానే సాగింది. మొదటి ఓవర్ లోనే సిరాజ్ జీటీ ఓపెనర్ గుర్బాజ్ ను LBW చేస్తే..పవర్ ప్లే ముగిసే లోపు రషీద్ ఖాన్ ప్రమాదకర సునీల్ నరైన్ నూ అవుట్ చేశాడు. దీంతో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ను కెప్టెన్ అజింక్యా రహానే ఆదుకున్నాడు. 36 బాల్స్ ఆడినా 5 ఫోర్లు ఓ సిక్సర్ తో సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి కేకేఆర్ కుప్పకూలకుండా అడ్డు పడ్డాడు. కానీ సుందర్ బౌలింగ్ లో బట్లర్ స్టంప్ అవుట్ చేయటంతో కెప్టెన్ రహానే నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.
5. కలిసి కట్టుగా కమ్మేసిన జీటీ బౌలర్లు
కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ ఒక్కో దశలో ఒక్కో గుజరాత్ బౌలర్ వికెట్లు తీస్తూనే ఉన్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో సిరాజ్, రషీద్ ఖాన్ జోరు చూపించారు. సిరాజ్ ఓ వికెట్ తీస్తే..రషీద్ ఖాన్ కేకేఆర్ లో ఉన్న ఇద్దరు కరీబియన్ హిట్టర్లైన నరైన్, రస్సెల్ వికెట్లు తీసుకున్నాడు. అయ్యర్ ను సాయి కిశోర్ అవుట్ చేస్తే...రమణ్ దీప్ సింగ్, మొయిన్ అలీల వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ తీసుకున్నాడు. రింకూ సింగ్ ను ఇషాంత్ అవుట్ చేశాడు. ఇలా జట్టంతా అంటే 11 మందిలో 9 మంది బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నా కూడా వాళ్లందరినీ ఆపి 159 పరుగులకే పరిమితం చేసి మరీ గుజరాత్ టైటాన్స్ 39పరుగుల తేడాతో కేకేఆర్ ను మట్టికరిపించింది.
ఈ విజయంతో 12 పాయింట్లు సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటే మ్యాచ్ ఓడిన కేకేఆర్ సీజన్ లో ఐదో ఓటమితో ఏడో స్థానంలోనే కొనసాగుతోంది.





















