Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Samantha Likes Post: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఓ పోస్టును లైక్ చేయడంపై చర్చ సాగుతోంది. కపుల్ రిలేషన్ షిప్ బ్రేకప్‌పై ఆ పోస్ట్ షేర్ చేశారు.

Samantha Likes Post About Relationship Abondonment: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత (Samantha).. ఇన్ స్టాలో రిలేషన్ షిప్ బ్రేకప్‌పై వచ్చిన ఓ పోస్ట్‌కు లైక్ కొట్టారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అనారోగ్యంతో ఉన్న భార్యను భర్త వదిలించుకోవడానికే మొగ్గు చూపుతున్నారనేది ఆ పోస్ట్ సారాంశం.
ఆ పోస్టులో ఏముందంటే..
సక్సెస్ వెర్స్ అనే ఇన్ స్టా ఖాతాలో ఎక్కువగా హెల్త్, రిలేషన్ షిప్ వంటి అంశాలపైనే ఎక్కువగా పోస్టులు షేర్ అవుతుంటాయి. ఇందులో భాగంగానే మ్యారేజ్ రిలేషన్ బలహీనం కావడంపై ఓ సర్వేను రీసెంట్‌గా పోస్ట్ చేశారు. 'కుటుంబంలో వైఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆ భర్త ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నాడు. ఒకవేళ భర్తకు హెల్త్ బాగా లేకుంటే భార్య మాత్రం అతన్ని విడిచిపెట్టడం లేదు. తాజా సర్వేలో ఇది కన్ఫర్మ్ అయ్యింది.
వైఫ్‌తో ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో తేలింది. ప్రతీ వెయ్యి మందిలో 624 మంది భార్యను వదిలించుకునే వారే ఉన్నారని సర్వే స్టాటస్టిక్స్ చెబుతున్నాయి.' అనేది ఆ పోస్ట్ సారాంశం. దీనికి నటి సమంతతో పాటు సుమారు 60 వేల మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. ఆమె ఇలాంటి పోస్ట్ లైక్ చేయడంపై నెట్టింట చర్చిస్తున్నారు.
View this post on Instagram
నాగచైతన్యతో డివోర్స్, వ్యక్తిగత జీవితంలో పలు సంఘటనల తర్వాత సమంత.. ఎక్కువగా హెల్త్, మహిళల సంరక్షణ, సక్సెస్, ఆత్మస్థైర్యం వంటి విషయాలపైనే నెటిజన్లకు సందేశాలు ఇస్తుండేవారు. సోషల్ మీడియాలో రిలేషన్ షిప్‌నకు సంబంధించి వచ్చే పోస్టులను లైక్ చేయడం లేదా షేర్ చేస్తున్నారు. తాజాగా.. రిలేషన్ షిప్ బ్రేకప్ సర్వేపై పోస్ట్‌ను లైక్ చేశారు.
Also Read: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
నాగచైతన్యతో 2021లో విడిపోయారు సమంత. ఆ తర్వాత ఏడాది తాను మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే సినిమాలు, సిరీస్‌ల్లో నటించారు. చివరిసారిగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'సిటాడెల్: హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇక రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'లో ఆమె కనిపించనున్నారు. 'మా ఇంటి బంగారం' అనే సినిమాలోనూ నటిస్తున్నట్లు సమంత ఇటీవల ప్రకటించారు.
నిర్మాతగా 'శుభం' మూవీ..
సమంత ఇటీవలే 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. 'శుభం' మూవీని నిర్మించారు. ఈ మూవీకి 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















