Dilsukhnagar Blasts Verdict: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
Dilsukhnagar twin blasts | 2013లో దిల్‌సుఖ్ నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషుల పిటిషన్లు కొట్టివేస్తూ, NIA కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది.

హైదరాబాద్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షనుు హైకోర్టు సమర్థించింది. ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. నగరంలో విషాదాన్ని నింపిన ఈ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.
2013 ఫిబ్రవరి 21 న జరిగిన దిల్ సుఖ్ నగర్ జంట బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ చర్యగా గుర్తించింది NIA కోర్టు. ఈ జంట పేలుళ్లో లో 17 మంది మృతి చెందగా, 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో యాసినన్ బత్కల్ కిలక సూత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఏ-1 గా అసదుల్లాహ అక్తర్,
ఏ-2 యాసిన్ భక్తల్,
ఏ-3 తహసిన్ అక్తర్,
ఏ-4 గా జియావుర్ రెహ్మాన్,
ఏ5 గా ఎజాక్ షాయిక్ లను దోషులుగా తేల్చింది.
ఉరిశిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ కోర్టు..
దిల్‌సుఖ్ నగర్‌లో బస్టాప్ వద్ద, టిఫిన్ సెంటర్ వద్ద జరిగిన జంట పేలుళ్ల కేసును NIA దర్యాప్తు చేసింది. అప్పట్లో టిఫిన్ బాక్స్ బాంబు పేల్చారని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విచారణ చేపట్టిన ఎన్ఐఏ కోర్టు వీరిని దోషులుగా గుర్తించి 2016 డిసెంబర్ 13న ఉరిశిక్ష విధించాలని తీర్పు వెలువరించింది. దోషులు హైకోర్టులో సవాల్ చేయగా.. వారి అప్పీళ్లపై ఇదివరకే వాదనలు ముగిశాయి. జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలతో కూడిన బెంచ్ దాదాపు 45 రోజులపాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్ష తీర్పును నేడు హైకోర్టు సమర్థించింది. దోషులు చేసుకున్న అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది.
ఎన్ఐఏ కోర్టు తీర్పు సమర్థించిన హైకోర్టు..
ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన నిందితుల్లో యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. ఉరిశిక్ష వేయడానికి ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. అయితే తమకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని ఐదుగురు నిందితులు దాఖలు చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించింది.
2013 ఫిబ్రవరి 21న సాయంత్రం మొదట స్వాతి టిఫిన్స్ వద్ద బాంబు పేలింది. ఏం జరిగిందోనని జనాలు అర్థం చేసుకునేలోపే బస్టాప్ వద్ద బస్ షెల్టర్ వద్ద మరో బాంబు పేలడం అప్పట్లో సంచలనమే. ఆ పేలుళ్లలో గాయపడి అక్కడికక్కడే చనిపోయిన వారు కొందరు, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు. కొందరు ఇప్పటికీ మంచానికి పరిమితమై సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోతే, మంచాన పడితే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. దోషులకు మరణశిక్ష విధించాలని బాధితుల కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సాయిబాబా టెంపుల్ వద్ద బాంబు పెట్టాలనుకున్నారు. కానీ వీలుకాకపోవడంతో రద్దీగా ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద ఒకటి, బస్ షెల్టర్ లో మరో బాంబును అమర్చి పేల్చడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.






















