Free online DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
Free online DSC Coaching: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 24 నుంచి ఆన్‌లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభంకానుంది. పూర్తి వివరాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివరించారు.

Free online DSC Coaching: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025 కోసం సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. 24వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించనుంది. ఈ కోచింగ్ ఉచిత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనందున సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని వెలుగు కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంత్రి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.... టీడీపీ ప్రభుత్వాల హయాంలో విద్యా వ్యవస్థను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విద్యశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యంగా గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు.
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. చెప్పినట్లుగానే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొదటి 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై సంతకం చేశారని తెలిపారు. ఇప్పటికే టెట్ నిర్వహించామన్నారు. వచ్చే జూన్ నాటికి డీఎస్సీ నిర్వహించడంతోపాటు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తమది చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైందని మంత్రి సవిత తెలిపారు.
సీఎం చంద్రబాబుకు, లోకేశ్ కు థ్యాంక్స్
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు రూపొదిద్దుకుంటుందని భావిస్తూ, టీడీపీ ప్రభుత్వాలు విద్యావ్యవస్థ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర చరిత్రలో 1.80 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వాలకే చెందుతాయన్నారు. ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ విధానం తెచ్చింది కూడా సీఎం చంద్రబాబేనని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ మెగా డీఎస్సీ నిర్వహణకు శ్రీకారం చుట్టిన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర విద్యశాఖ మంత్రి నారా లోకేశ్‌కు డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
24 నుంచి ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్
డీఎస్సీ ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు బీసీ అభ్యర్థులే సాధించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. అందుకనుగుణంగా బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 26 జిల్లా కేంద్రాల్లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కేంద్రాల ద్వారా 5,200 మందికి ఉచిత డీఎస్సీ శిక్షణతో పాటు కోచింగ్ సమయంలో నెలకు రూ.1500ల స్టయిఫండ్, మెటీరియల్ కోసం మరో అదనంగా రూ.1000 అందజేసినట్లు తెలిపారు. గృహిణులు, ఇతర అభ్యర్థుల కోసం ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుడుతూ సీఎం చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. థాంక్యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముక్తకంఠంతో ధన్యవాదాలు తెలిపారు.





















