AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో ఏపీ DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. లేదా అని అభ్యర్థులు దీనిపై టెన్షన్ పడుతున్నారు. ఏజ్ లిమిట్, టెట్ క్వాలిఫికేషన్ మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి.

AP Mega DSC Notification fees | ఏపీలో మెగా డీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ ఆదివారం ఉదయం విడుదలైంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కి నేటి నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కు ఎలా అప్లై చేసుకోవాలో సైతం మంత్రి నారా లోకేష్ ఓ వీడియో షేర్ చేశారు.
జనరల్ అభ్యర్థుల వయసు 2024 జూలై ఒకటో తేదీ నాటికి 18 కన్నా తక్కువ ఉండరాదు, 44 వేల కన్నా ఎక్కువ ఉండకూడదు. రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయసు 49 ఏళ్లు కాగా, దివ్యాంగులకైతే 59 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉంది. డీఎస్సీ రాయాలంటే టెట్‌లో ఓసీ అభ్యర్థులైతే 60 శాతం (90 మార్కులు), బీసీలకు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం (60 మార్కులు) మార్కులు రావాలి. వారే డీఎస్సీకి అర్హులవుతారు.
డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే
👉 https://cse.ap.gov.in
👉 https://apdsc.apcfss.in
మెగా డీఎస్సీ విడుదలయ్యాక అభ్యర్థులకు ఓ సందేహం తలెత్తింది. గత డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఫీజు చెల్లించాలా, లేదా అని పలువురు అభ్యర్థులకు డౌట్ వచ్చింది. వైసిపి ప్రభుత్వం హయాంలో 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించిన వారు, తాజా దరఖాస్తులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే గతంలో ఏ కేటగిరి పోస్టులకు అప్లై చేసుకున్నారు, ఇప్పుడు అదే పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి అదనపు ఫీజు చెల్లించిన అక్కర్లేదు. కానీ గతంలో చేసిన దరఖాస్తు కంటే ఒక్క సబ్జెక్టుకు ఎక్కువగా అప్లై చేసినా, 750 రూపాయలు చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది.
మెగా డీఎస్సీ అప్లికేషన్లో మూడు విభాగాలు ఉండగా.. మొదటి సెక్షన్లో అభ్యర్థి వ్యక్తిగత సమాచారం, రెండో సెక్షన్లో విద్యార్హతలు, అర్హత ఉన్న పోస్టుల వివరాలు, మూడో సెక్షన్ లో అభ్యర్థి ఫీజు చెల్లించాల్సిన వివరాలు ఉంటాయి. మొదటి రెండు విభాగాల్లో విషయాలను అభ్యర్థి ఎడిట్ చేసుకోవచ్చు. మూడు సెక్షన్లలో వివరాలు నింపిన తర్వాత అభ్యర్థులు ఒక్కో పోస్టుకు 750 రూపాయలు చెల్లించాలి.
అభ్యర్థులు తమ విద్యార్హతను బట్టి పోస్టులకు ఆప్షన్ ఇచ్చుకోవాలి. పోస్టులకు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకున్నాక, ప్రాథమిక క్రమాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. ఎవరైనా అభ్యర్థి మొదటి పోస్ట్ ప్రాధాన్యత ఆప్షను సెలెక్ట్ చేసుకోకపోతే వారి పేరు రెండో ఆప్షన్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరైనా అభ్యర్థి మొదటి ఆప్షన్ కె ఎంపికైనట్లయితే మిగతా ఆప్షన్ లు రద్దు అవుతాయి. ఏదైనా ఒక పోస్ట్ కు సెలెక్ట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పోస్టు పరిచే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్
- ఏప్రిల్ 20వ తేదీన ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభం
- మే 15 దరఖాస్తుల స్వీకరణకు ముగియనున్న గడువు
- మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టుల నిర్వహణ
- మే 30 డీఎస్సీ ఎగ్జామ్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం
- జూన్ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ





















