అన్వేషించండి

AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే

AP Mega DSC 2025 Application | ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లోనే మే 15వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

AP DSC Notification released for 16347 Teaching Posts | అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శనివారం ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఓర్పు, పట్టుదల, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుల నియామకం కీలక అంశమని లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మెగా డీఎస్సీ సంబంధించిన జీవో, టీచర్ పోస్ట్ల వివరాలు, ఎగ్జామ్ షెడ్యూలు, సిలబస్ ఇలాంటి పూర్తి వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://apdsc.apcfss.in/# ను సందర్శించాలని సూచించారు.  

డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే

👉 https://cse.ap.gov.in
👉 https://apdsc.apcfss.in


ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్‌
- ఏప్రిల్‌ 20వ తేదీన ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ప్రారంభం
- మే 15  దరఖాస్తుల స్వీకరణకు ముగియనున్న గడువు 
- మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టుల నిర్వహణ  
- మే 30 డీఎస్సీ ఎగ్జామ్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం
- జూన్‌ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ 

అన్ని పరీక్షలు పూర్తయ్యాక రెండు రోజుల తరువాత ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. అనంతరం 7 రోజులపాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజులకు డీఎస్సీ ఎగ్జామ్స్ ఫైనల్ ‘కీ’ విడుదల చేయనున్నారు. మరో వారం రోజులకు డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదల కానుంది.

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలివే..
మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పురపాలక, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులకు జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ ఉంటుంది. ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు బధిర, అంధుల స్కూల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో భర్తీ చేస్తారు. 

ఎస్జీటీ పోస్టులు 6,599 ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 7,487, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు కలిపి మొత్తం 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్‌-1లో 400 పోస్టులు, జోన్‌-2లో 348 పోస్టులు, జోన్‌-3లో 570, జోన్‌-4లో అత్యధికంగా 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక స్కూళ్లలో మొత్తం 13,192 పోస్టులు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్‌ పాఠశాలల్లో 15 ఖాళీలు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget