అన్వేషించండి

Peddi Teaser : పెద్ది టీజర్ రెడీ! - న్యూ టైటిల్ విత్ స్పెషల్ డే... రామ్ చరణ్ మాస్ వీడియో వచ్చేది ఎప్పుడంటే?

Peddi Teaser Release Date : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ మాస్ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Ram Charan's Peddi Movie Teaser Release Date Locked : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబో అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ నుంచి రయ్ రయ్ సాంగ్ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. టీజర్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

టీజర్ ఎప్పుడంటే?

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేసినా... అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు అదే రోజున టీజర్ రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. 'కుస్తీ' పేరుతో రానున్న టీజర్‌తో చరణ్ మాస్ రోల్, స్టోరీపై ఓ క్లారిటీ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Also Read : 'ప్రేయసి రావే'కి సీక్వెల్ రెడీ - పిఠాపురంలో అలా మొదలైంది ట్రైలర్ ఈవెంట్‌లో బిగ్ అప్డేట్

టైటిల్ గ్లింప్స్‌లో సిగ్నేచర్ షాట్ నుంచి చరణ్ మాస్ లుక్స్ మూవీపై హైప్ పదింతలు పెంచేశాయి. వీటితో పాటే చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చరణ్ మాస్ ఎనర్జిటికల్ స్టెప్స్ లక్షల్లో రీల్స్ చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ రాబోయే టీజర్ వీటన్నింటినీ మించి ఉండడం కన్ఫర్మ్ అంటున్నారు చరణ్ ఫ్యాన్స్.

సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

రిలీజ్ ఎప్పుడంటే?

ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌గా యాక్షన్ ఎలిమెంట్స్‌తో మూవీ రూపొందుతోంది. అనుకోని కారణాలతో వాయిదా పడిన మూవీ వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

RC17 అప్డేట్ కూడా...

ఇక ఇదే రోజున చరణ్ నెక్స్ట్ మూవీపైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌తో చరణ్ మూవీ చేయబోతుండగా... ఇప్పటికే స్టోరీ లాక్ అయ్యింది. పీరియాడిక్ లేదా గ్రామీణ నేపథ్యంలో డిఫరెంట్‌గా స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా... చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. 

టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ అంటా కూమెంట్స్ వస్తున్నాయి. 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Sobhita Dhulipala: అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
Ram Charan - Sara Arjun: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?
రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?
Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget