MegaVerse Teaser : ఇది నా అడ్డా... CHIRA'N'JEEVI - మెగాస్టార్ టాక్ షో మెగావర్స్ టీజర్ వచ్చేసింది
Megaverse OTT : మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ డెబ్యూ టాక్ షో మెగావర్స్ టీజర్ వచ్చేసింది. 'ఇది నా అడ్డా' అంటూ చిరు చెప్పిన డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Chiranjeevi's Mega Verse Teaser Out : మెగాస్టార్ చిరంజీవి టాక్ షో 'మెగావర్స్' నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. తాజాగా డిజిటల్ టాక్ షో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. గత రెండు రోజులుగా 'N' మిస్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ 'N' నెట్ ఫ్లిక్స్ స్టైల్‌లో రివీల్ చేస్తూ చిరు చేసిన స్పెషల్ వీడియో ట్రెండ్ అవుతోంది.
'ఇది నా అడ్డా'
'CHIRA_JEEVI'లో 'N' లెటర్ మిస్ అవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోగా... వేర్ ఈజ్ 'N' అంటూ అందరూ షాక్ అవుతుంటారు. ఫైనల్‌గా నెట్ ఫ్లిక్స్ స్టైల్‌లో 'N' లెటర్ రివీల్ చేస్తూ... మెగాస్టార్ 'ఇది నా అడ్డా' అంటూ డైలాగ్ చెప్పడం హైప్ క్రియేట్ చేస్తోంది. ''N' వచ్చేసింది... మెగా కొల్లాబ్రేషన్ కురిసింది. మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు అన్నీ ఒకే చోట. నెట్ ఫ్లిక్స్ యూనివర్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యారు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read : Vijay Antony : మొన్న జనరల్ భోగీలో జర్నీ - నేడు మిర్చీ బజ్జీలు వేసిన హీరో... వీడియోస్ వైరల్
గ్రాండ్‌గా లాంచింగ్ ఈవెంట్
ఈ టాక్ షోలో సెలబ్రిటీలను మెగాస్టార్ చిరు ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ సందర్భంగా షో లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో సాయంత్రం 4:30 గంటల నుంచీ ఈవెంట్ గ్రాండ్‌గా చేయనున్నారు. ఈ వేడుకలో సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యాన్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వేదికగా టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే డేట్ వెల్లడించనున్నారు. మొత్తం 15 ఎపిసోడ్స్‌తో ఫస్ట్ సీజన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
సెలబ్రిటీలు ఎవరంటే?
'మెగావర్స్' (Megaverse) ఫస్ట్ ఎపిసోడ్‌లో హాస్య బ్రహ్మ 'బ్రహ్మానందం'తో పాటు వెన్నెల కిశోర్, కమెడియన్ సత్య హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే, కింగ్ నాగార్జున ఫ్యామిలీని కూడా చిరు ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా కాంబో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కూడా టాక్ షోకు అటెండ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే, టాలీవుడ్ స్టార్స్ నాని, రవితేజ ఒక ఎపిసోడ్‌లో సూర్య, జ్యోతిక, కార్తి మరో ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారని టాక్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‍తో మెగా స్పెషల్ ఎపిసోడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మెగా ఫ్యామిలీ లెజెండ్స్ ఒకే వేదికపై కనిపించనున్నారు. అలాగే, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, తమన్ కలిసి ఒక ఎపిసోడ్, కమల్ హాసన్, బాలయ్యతో పాటు దగ్గుబాటి హీరోలు కూడా టాక్ షోలో పాల్గొనే ఛాన్స్ ఉంది.
Also Read : Niharika Konidela : నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























