అన్వేషించండి

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!

వాతావరణ పరిస్థితులను గమనిస్తే, రెండు రోజులు కొన్ని జిల్లాల్లో వర్షం తీవ్రత చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వానలు దంచికొట్టే ఛాన్స్ ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్ల విస్తారంగా వర్షాలు.
  • తీర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాల హెచ్చరిక.
  • పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
  • రైతులు అప్రమత్తంగా ఉండి, ఆకస్మిక వర్షాలకు సిద్ధంగా ఉండాలి.

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటి వరకు ఎండలతో అల్లాడిన జనం ఇప్పుడు వర్షం వస్తుందని సంతోషపడాలో లేక పంటలు పోతున్నాయని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఏ జిల్లాల్లో ఎంత ప్రభావం 

వాతావరణ పరిస్థితులను గమనిస్తే, రాబోయే 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షం తీవ్రత చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వానలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా కొన్ని జిల్లాలకు  అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్‌, గుంటూరు, అనంతపురం, బాపట్ల, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, కృష్ణా, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సమాచారం. అదే సమయంలో పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం కూడా విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగుల ముప్పు పొంచి ఉంది. 

పిడుగుల ముప్పు- ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

వర్షం కురిసే సమయంలో కేవలం తడవకుండా ఉంటే సరిపోదు, పిడుగుల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడుతున్నప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద నిలబడకూడదు. అలాగే ఎలక్ట్రిక్ పోల్స్, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. పిడుగు పడే సమయంలో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నదాతలకు వాతావరణ శాఖ కీలక సూచనలు 

ఈ అకాల వర్షాలు, పిడుగుల వల్ల ఎక్కువ నష్టపపోయేది రైతన్నలే. అందుకే వ్యవసాయ పనులు చేసుకునే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. పంట పొలాల్లో పని చేసే సమయంలో ఆకాశంలోని వాతావరణ మార్పులు గమనిస్తూ ఉండాలి. గాలి వానలు లేదా పిడుగులు పడే సూచనలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. 

అసలు ఈ మార్పులకు కారణం ఏంటీ?

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల గాలులు దిశలో మార్పులు రావడం, వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల మేఘాలు త్వరగా ఏర్పడి ఇలాంటి వర్షాలకు దారి తీస్తాయి.                             

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

ఏయే జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది?

విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, బాపట్ల, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, కృష్ణా, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

పిడుగులు పడే సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించడం మంచిది.

ఈ అకాల వర్షాలకు కారణం ఏమిటి?

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల గాలుల దిశలో మార్పులు, వాతావరణంలో అధిక తేమ శాతం కారణంగా మేఘాలు ఏర్పడి ఈ వర్షాలు కురుస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Embed widget