అన్వేషించండి

Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 

Karimnagar SI Chandrasekhar Suicide: కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్‌ చంద్రశేఖర్ శనివారం సూసైడ్ చేసుకున్నారు. ఐదు రోజుల క్రితమే తన భార్య కూడా సూసైడ్ చేసుకుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ అత్తారింట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
  • ఐదు రోజుల క్రితం భార్య దివ్య విషం తాగి మరణించారు.
  • భార్య మరణించిన దుఃఖంతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు.
  • తక్కువ వ్యవధిలో భార్యాభర్తల మరణంతో కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.

Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య దివ్య ఐదు రోజుల క్రితమే సూసైడ్ చేసుకుంది. ఇంతలో ఆయన కూడా ఇలా చనిపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. 

ఒకే కుటుంబంలో కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన రెండు వరుస మరణాలు కరీంనగర్‌ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య అకాల మరణాన్ని తట్టుకోలేక, ఆమె లేని లోటును భరించలేక ఓ బాధ్యతాయుతమైన పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య చనిపోయిన ఐదు రోజులకే ఆయన కూడా అదే బాట పట్టడం స్థానికంగా అందర్నీ కలిచివేసింది.

కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్‌ చంద్రశేఖర్ శనివారం సూసైడ్ చేసుకున్నారు. జమ్మికుంట మండలం పరిధిలోని సీతంపేటలో ఉన్న తన అత్తవారి ఇంటికి వెళ్లి అక్కడే ఉరేసుకొని ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే చంద్రశేఖర్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. 

ప్రేమించిన భార్య మరణమే ప్రధాన కారణం

చంద్రశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భార్య దివ్య మృతి అని స్థానికులు చెబుతున్నారు. సరిగా ఐదు రోజుల క్రితం దివ్య ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. గత మంగళవారం మధ్యాహ్నం ఆ నొప్పిని భరించలేక గన్నేరు పువ్వుల రసం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 

ఆ సమయంలో విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌కు దివ్య ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి దివ్య మరణించింది. దివ్య తండ్రి తెడ్ల చిన్న సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

భార్య మరణించినప్పటి నుంచి చంద్రశేఖర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆమెతో గడిపిన జ్ఞాపకాలు, ఆమె లేని ఒంటరితనం ఆయనను కుంగదీశాయి. హనుమాన్ నగర్‌లో నివసిస్తున్న చంద్రశేఖర, భార్య మరణం తర్వాత తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. చివరకు భార్య మరణించిన ఐదు రోజులకే ఆమె వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకొని సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో రెండు కుటుంబాలు కోలుకోలేని విషాదంలో మునిగిపోయాయి. 

Frequently Asked Questions

కరీంనగర్ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?

ఎస్సై చంద్రశేఖర్ తన భార్య దివ్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మరణించిన ఐదు రోజులకే ఆయన కూడా ఆమెను అనుసరించారు.

చంద్రశేఖర్ భార్య దివ్య ఎప్పుడు, ఎలా మరణించింది?

దివ్య గన్నేరు పువ్వుల రసం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం రాత్రి మరణించింది.

చంద్రశేఖర్ ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు?

ఎస్సై చంద్రశేఖర్ జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తారింటికి వెళ్లి అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చంద్రశేఖర్ భార్య మరణానికి ముందు ఎటువంటి సమస్యలతో బాధపడింది?

దివ్య కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పిని భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget