By: Arun Kumar Veera | Updated at : 18 Feb 2025 02:11 PM (IST)
బీమా పాలసీహోల్డర్లకు గుడ్‌న్యూస్! ( Image Source : Other )
Insurance Policy Free Look Period To Be Increased: ఇప్పుడు, అన్ని బీమా కంపెనీలు "ఫ్రీ-లుక్ పిరియడ్"ను అందిస్తున్నాయి. ఫ్రీ-లుక్ పిరియడ్ అంటే.. మీకు ఒక బీమా కంపెనీ నుంచి ఒక పాలసీని కొన్న తర్వాత, అది మీకు నచ్చకపోతేనో లేదా మీ అవసరాలకు సరిపోకపోతేనో దానిని రద్దు చేసుకోవచ్చు. బీమా కంపెనీ, మీరు చెల్లించిన ప్రీమియం డబ్బుల్లో పన్నుల వరకు మినహాయించుకుని, మిగిలిన డబ్బును మీకు తిరిగి చెల్లిస్తుంది. ఫ్రీ-లుక్ పిరియడ్‌ను ఒక విధంగా "టెస్టింగ్ పిరియడ్"గా చెప్పుకోవచ్చు. అంటే, ఆ పాలసీ మీకు సూట్ అవుతుందో, లేదో మీరు టెస్ట్ చేసే కాలం అది. ప్రస్తుతం, బీమా కంపెనీలు ఒక నెల ఫ్రీ-లుక్ పిరియడ్‌ను అందిస్తున్నాయి.
పెద్ద నష్టం లేకుండానే వదిలించుకోవచ్చు
మీరు ఒక బీమా పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, దాని ప్రయోజనాలుగానీ, రాబడిగానీ, మరే విషయమైనా మీకు నచ్చలేదని అనుకుందాం. మీరు ఆ బీమా పాలసీని వదిలించుకోవచ్చు. పాలసీని కొనుగోలు చేసిన తేదీ నుంచి నెల రోజుల లోపల దానిని రద్దు చేసుకోవచ్చు. దీనివల్ల, మీ అవసరాలకు లేదా లక్ష్యాలకు సరిపోని బీమా పాలసీని పెద్ద నష్టం లేకుండానే వదిలించుకోవచ్చు. ఫ్రీ-లుక్ పీరియడ్‌లో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
నెలకు బదులు సంవత్సరం
ప్రస్తుతం ఫ్రీ లుక్ పిరియడ్ వ్యవధి నెల రోజులు. పాలసీదార్లు, ఇకపై, ఒక సంవత్సరం ఫ్రీ లుక్ పిరియడ్‌ను పొందే అవకాశం ఉంది. ఫ్రీ లుక్ వ్యవధిని నెల రోజుల నుంచి ఒక సంవత్సరానికి పొడిగించాలని బీమా కంపెనీలను కోరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఆర్థిక మంత్రి సూచనను బీమా కంపెనీలు అమలులోకి తీసుకువస్తే, బీమా తీసుకున్న వారికి ఒక సంవత్సరం వెసులుబాటు ఉంటుంది. అంటే, బీమా పాలసీ తీసుకున్న తర్వాత, పెద్ద నష్టం లేకుండా దానిని రద్దు చేసుకునే అవకాశం ఒక సంవత్సరం వరకు ఉంటుంది.
ఇన్సూరెన్స్ హోల్డర్ ప్రయోజనాలకు రక్షణ
బీమా ఫ్రీ లుక్ వ్యవధి నెల రోజుల నుంచి ఒక సంవత్సరానికి పెంచడం వలన బీమా తీసుకునే వారి ప్రయోజనాలకు మరింత భద్రత లభిస్తుంది. ఎందుకంటే, వివిధ కంపెనీల బీమా పాలసీల రాబడిని పోల్చడానికి నెల రోజుల గడువు సరిపోదు. ఇది కాకుండా, పాలసీహోల్డర్ ఆర్థిక పరిస్థితి ఒక సంవత్సరం లోపు మారవచ్చు. కొన్ని నెలలు పాలసీ కట్టిన తర్వాత, అతను బీమా ప్రీమియం చెల్లించలేకపోవచ్చు. కాబట్టి, బీమా తీసుకునే వారికి కనీసం ఒక సంవత్సరం పాటు బీమా పాలసీని టెస్ట్ చేసే అవకాశం ఇవ్వాలని మార్కెట్ వర్గాలు చాలా కాలం నుంచి కోరుతున్నాయి. దీనివల్ల పాలసీ అమ్మకాలు కూడా పెరుగుతాయని అంచనా, అది బీమా కంపెనీలకు లాభం చేకూరుస్తుంది.
IREDA ప్రతిపాదనలు
బీమా తీసుకునే వ్యక్తుల ప్రయోజనాలను కాపాడటానికి, 'బీమా అభివృద్ధి & నియంత్రణ సంస్థ' ఇరెడా (IREDA) కూడా కొన్ని ప్రతిపాదనలు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో ఒకటి - పాలసీ వాపసు & బీమా క్లెయిమ్‌ల చెల్లింపు కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌ను ప్రారంభించడానికి, బీమా కంపెనీలు పాలసీ ప్రతిపాదన దశలోనే పాలసీదారుడి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాలి.
మరో ఆసక్తికర కథనం: రైలు ఎక్కేటప్పుడు ప్రమాదంలో మరణిస్తే IRCTC పరిహారం ఇస్తుంది, అందరికీ కాదు!
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
GHMC Property Tax: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు