By: Arun Kumar Veera | Updated at : 17 Feb 2025 04:03 PM (IST)
45 పైసల ప్రీమియంతో 10 లక్షల రూపాయల బీమా ( Image Source : Other )
IRCTC Travel Insurance Rules: న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఘోర ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా, 27 మందికి స్వల్పంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉండడం విషాదాన్ని మరింత పెంచింది. రైల్వే శాఖ, చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం (Death Compensation) ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్తున్న ప్రజలు న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లోని 14 & 15 ప్లాట్‌ఫామ్‌లపై భారీ సంఖ్యలో గుమిగూడారు. రైలు వస్తున్న ప్లాట్‌ఫామ్ నంబరును అనౌన్స్ చేయగానే, ఫ్లాట్‌ఫామ్ నంబర్ మారిందని జనం భావించారు. 12వ ఫ్లాట్‌ఫామ్ మీదకు వెళ్లడానికి ఒక్కసారిగా దూసుకెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగి, ప్రాణనష్టానికి కారణమైంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో, రైలు ప్రమాద బీమా & పూర్తి వివరాల గురించి ప్రజలు ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించారు. రైలు ఎక్కేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి పాలసీదారు మరణిస్తే అతని కుటుంబానికి ఎంత పరిహారం అందుతుంది? అనే సందేహాలకు సమాధానాల కోసం కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. రైలులోకి ఎక్కిన తర్వాత ఏదైనా ప్రమాదం వల్ల ప్రాణనష్టం జరిగితే, పరిహారానికి సంబంధించి IRCTCలో రూల్స్ (IRCTC travel insurance rules) ఉన్నాయి.
ఈ వ్యక్తులకు మాత్రమే IRCTC పరిహారం
రైలు ప్రయాణీకుడు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం వల్ల చనిపోతే, అతని కుటుంబానికి బీమా డబ్బు అందుతుంది. అయితే, అందరికీ ఈ పరిహారం లభించదు. ఆన్‌లైన్‌లో ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు బీమా ఆప్షన్ ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే IRCTC పరిహారం చెల్లిస్తుంది.
45 పైసల ప్రీమియంతో 10 లక్షల రూపాయల బీమా
IRCTC, కేవలం 45 పైసల ప్రీమియంతో రూ. 10 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఇది వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు IRCTC బీమా ఆప్షన్ ఎంచుకున్న వ్యక్తి (పాలసీదారు), రైలు ఎక్కేటప్పుడు లేదా ప్రమాదం కారణంగా మరణిస్తే అతని కుటుంబానికి IRCTC నుంచి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు కూడా రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. బీమా తీసుకోని వ్యక్తులు ఈ ప్రయోజనాలను పొందలేరు.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో మాత్రమే
IRCTC బీమా సదుపాయం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది. రైల్వే టికెట్ కౌంటర్‌లో టికెట్ తీసుకుంటే బీమా సదుపాయం వర్తించదు.
IRCTC ప్రమాద బీమా ఎలా తీసుకోవాలి?
రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేస్తున్నప్పుడు.. IRCTC వెబ్‌సైట్‌లో లేదా యాప్‌లో ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న వ్యక్తుల మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి ఒక లింక్ వస్తుంది. బీమా సంస్థ ఆ లింక్‌ను పంపుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ చేయడం ఈజీ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: బ్లాక్ లిస్ట్ నుంచి బయటకురాకపోతే 'డబుల్ ఫీజ్' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్
Desert Cooler Vs Tower Cooler: డెజెర్ట్ కూలర్ లేదా టవర్ కూలర్ - మీ ఇంటికి ఏది బెస్ట్ ఛాయిస్?
OTP Scam: OTP స్కామ్ నుంచి మీ డబ్బును ఎలా రక్షించుకోవాలి, నకిలీ రిక్వెస్ట్‌ను ఎలా గుర్తించాలి?
New Money Rules: మార్చి నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్- తెలుసుకోకపోతే నష్టపోతారు!
UPI Lite New Feature: యూపీఐ లైట్ లావాదేవీలు, నిల్వ పరిమితి పెంపు - కొత్తగా ఓ సూపర్ ఫీచర్
Gold-Silver Prices Today 03 Mar: స్థిరంగా కొనసాగుతున్న పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Atlee - Allu Arjun Movie: అల్లు అర్జున్ తో మూవీకి అట్లీ భారీ డిమాండ్... పాన్ ఇండియా హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడా ?
PM Modi Takes Lion Safari: గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రధాని మోదీ లయన్ సఫారీ, ఆయన కొత్త టాలెంట్ చూశారా!
AP Mega DSC: మెగా డిఎస్సీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన