search
×

FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌

New Tollgate Rules: తక్కువ బ్యాలెన్స్, పేమెంట్‌ ఆలస్యం కావడం సహా కొన్ని విషయాల్లో ఫాస్టాగ్‌ రూల్స్‌ మారాయి. కొత్త నియమాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

FOLLOW US: 
Share:

Tollgate Charge New Rules: వాహన యజమానుల బద్ధకాన్ని వదిలించేలా ఫాస్టాగ్‌ రూల్స్‌ మారాయి. హైవేల మీద టోల్‌ వసూళ్ల కోసం 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI)తో కలిసి పని చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ.. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడానికి, మోసాలను అరికట్టడానికి, వివాదాలను తగ్గించడానికి ఫాస్టాగ్‌ (FASTag) నియమాల్లో కీలక మార్పులు చేసింది. కొత్త నియమాల ఈ రోజు ‍‌(సోమవారం, 17 ఫిబ్రవరి 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌ తెలీకుండా రోడ్డెక్కితే మోత మోగిపోద్ది.

ఫాస్టాగ్‌ నియమాలకు సంబంధించిన సర్క్యులర్‌ను 2025 జనవరి 28నే జారీ చేశారు. కొత్త రూల్స్‌ ప్రకారం, ఈ రోజు నుంచి, ఫాస్టాగ్‌లో తక్కువ బ్యాలెన్స్‌, చెల్లింపులు ఆలస్యం కావడం లేదా బ్లాక్‌లిస్ట్ ట్యాగ్‌ ఉన్న యూజర్లపై అదనపు జరిమానా విధిస్తారు.

కొత్త ఫాస్టాగ్‌ నియమాలు

తగిన బ్యాలెన్స్‌ లేని ఫాస్టాగ్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళుతుంది. ఒక వాహనం టోల్‌ ప్లాజాను చేరడానికి ముందు, ఆ ఫాస్టాగ్‌ 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, "ఎర్రర్‌ కోడ్‌ 176" (Error Code 176)ను చూపి లావాదేవీని తిరస్కరిస్తారు. టోల్‌ ప్లాజా వద్ద స్కాన్‌ చేసిన 10 నిమిషాల వరకు నిష్క్రియంగా (ఇన్‌యాక్టివ్‌) ఉన్నా కూడా “ఎర్రర్ కోడ్ 176”తో ఆ లావాదేవీని తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్భంలో పెనాల్టీ కింద "డబుల్‌ టోల్‌ ఫీజ్‌" వసూలు చేస్తారు. 

తక్కువ బ్యాలెన్స్‌ విషయంలో మాత్రమే కాదు... KYC వెరిఫికేషన్‌ పూర్తి చేయకపోవడం, ఛాసిస్‌ నంబర్‌ - వాహనం నంబర్‌ సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఫాస్టాగ్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళుతుంది. కాబట్టి, ఫాస్టాగ్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లకుండా చూసుకోవడం మీ జేబుకు మంచిది. ఎప్పటికప్పుడు ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలి. ఈ రూల్‌, ఫాస్టాగ్‌ను చివరి నిమిషంలో రీఛార్జ్‌ చేసే వ్యక్తుల బద్ధకాన్ని వదలగొడుతుంది.

అదనంగా, టోల్ చెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వివాదాలను తగ్గించడానికి ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియ, శీతలీకరణ వ్యవధి మరియు లావాదేవీ తిరస్కరణ నియమాలలో మార్పులు ప్రవేశపెట్టబడుతున్నాయి.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఫాస్టాగ్‌ వినియోగదారులు తమ వాహనం టోల్ రీడర్‌ను దాటిన 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తర్వాత వారి టోల్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తే అదనపు ఛార్జీలను ఎదుర్కోవలసి ఉంటుంది.

గతంలో, వినియోగదారులు టోల్ బూత్‌ దగ్గర తమ ఫాస్టాగ్‌ రీఛార్జ్ చేసుకుని ముందుకు వెళ్లిపోవచ్చు. ఇప్పుడు, అంత టైమ్‌ ఉండదు కాబట్టి, బండి టోల్‌ గేట్‌ దగ్గరకు రావడానికి ముందే తమ FASTag బ్యాలెన్స్‌ను తప్పనిసరిగా చూసుకోవాలి.

NPCI డేటా ప్రకారం, ఫాస్టాగ్‌ లావాదేవీలు 2024 డిసెంబర్‌లో 6 శాతం పెరిగాయి. 2024 నవంబర్‌లోని 359 మిలియన్లతో పోలిస్తే డిసెంబర్‌లో 382 మిలియన్లకు చేరుకున్నాయి. లావాదేవీ విలువ కూడా 9 శాతం పెరిగింది, డిసెంబర్‌లో మొత్తం రూ. 6,642 కోట్లు వసూలయ్యాయి, నవంబర్‌లో ఈ మొత్తం రూ.6,070 కోట్లుగా ఉంది.

మరో ఆసక్తికర కథనం: రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.40,000 కోట్లు ఇస్తుంది, ఖర్చు చేయడానికి రెడీగా ఉండండి 

Published at : 17 Feb 2025 12:30 PM (IST) Tags: NPCI Ministry of Road Transport Highways FASTag Fastag Rules Ministry Of Road Transport & Highways Tollgate Charges

ఇవి కూడా చూడండి

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్‌ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?

Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్‌ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?

Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?

Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?

Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

Multibagger Stock: ఆశ్చర్యం, ఐదేళ్లలో రూ.లక్ష ఒకటిన్నర కోట్లుగా మారింది - ఇప్పుడు 'ఉచితం'గా షేర్లు, డబ్బు!

Multibagger Stock: ఆశ్చర్యం, ఐదేళ్లలో రూ.లక్ష ఒకటిన్నర కోట్లుగా మారింది - ఇప్పుడు 'ఉచితం'గా షేర్లు, డబ్బు!

టాప్ స్టోరీస్

AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే

AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే

PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు

PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు

Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం

Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం