Balakrishna: ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
Hyderabad News: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా మరో 8 నెలల్లో ఏపీలోని తుళ్లూరులో ఆస్పత్రి ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. మనోధైర్యంతోనే వ్యాధిని జయించవచ్చన్నారు.

Balakrishna Said Cancer Hospital Will Establish Soon In Tullur: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింత విస్తరిస్తామని ఆస్పత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. ఇందులో భాగంగా ఏపీలోని తుళ్లూరులో (Tullur) మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని (Hyderabad) క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని అన్నారు. ఇప్పటివరకూ 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని.. ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ స్థాపించామని.. దీనికి ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో తోడ్పడాలని పిలుపునిచ్చారు. అవగాహనతో క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందరూ కలిసి క్యాన్సర్‌పై పోరాటం చేద్దామన్నారు.
Also Read: రష్మికపై మరోసారి కన్నడ వాసుల ఫైర్ - ఆ విషయం మాకు తెలియలేదంటూ ఆగ్రహం, అసలేం జరిగిందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

